విశాఖ ఇంజనీరింగ్ కళాశాల లో మహిళల ఆరోగ్యం పై సెమినార్.

విశాఖ ఇంజనీరింగ్ కళాశాల లో మహిళల ఆరోగ్యం పై సెమినార్.

పెందుర్తి:పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 22 :

పెందుర్తి నియోజకవర్గం .నరవ విశాఖ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాల  లో మహిళల ఆరోగ్యం పై సెమినార్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రముఖ న్యూట్రిసియన్ డాక్టర్. కె. సూర్య దీప్తి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినీలు, మహిళ అధ్యాపక అధ్యాపక సిబ్బంది ఆరోగ్యవంతంగా కావలసిన సలహాలు సూచనలు ఇచ్చి ఎటువంటి ఆహారం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని సూచించి మహిళల సమస్యల గురించి క్లుప్తంగా వివరించారు.ఈ కార్యక్రమంనికి కళాశాల ఉమెన్స్ గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థినీలు అడిగిన సందేశాలకు డాక్టర్  వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. శ్రీ శ్రీధర్ పట్నాయక్, ఉమెన్స్ గ్రీవెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. డయానా, మహిళా అధ్యాపక సిబ్బంది, మహిళ విద్యార్థులు పాల్గోన్నారు.