విశాఖ జిల్లా అధ్వర్యంలో ప్రారంభమైన తృతీయ స్థాపన టెస్టింగ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంప్

విశాఖ జిల్లా అధ్వర్యంలో ప్రారంభమైన తృతీయ స్థాపన టెస్టింగ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంప్

విశాఖ: పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 22 :

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖ జిల్లా అధ్వర్యంలో ప్రారంభమైన తృతీయ స్థాపన టెస్టింగ్ క్యాంప్ విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా 11 పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు ఈ క్యాంప్ అధికారిగా జిల్లా ట్రైనింగ్ కమిషనర్ దాసరి వేణుగోపాల్ వ్యవహరిస్తున్నారు. జిల్లా కార్యదర్శి రొక్కం మధుసూదన్ రావు ఆధ్వర్యంలో క్యాంప్ నడుస్తుంది. ఈనెల 21 నుండి 25 వరకు మర్రిపాలెం ఎస్సీ రైల్వే స్కూల్ ల్లో క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఇందులో ఉత్తీర్ణత పొందిన వారికి సర్టిఫికెట్లు వస్తాయి అని జిల్లా కార్యదర్శి మధుసూదన్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ చైర్మన్ మారుతి హరీష్ కుమార్, జిల్లా కోశాధికారి వీ తిరునాధరావు, జిల్లా జాయింట్ సెక్రెటరీ ఏ స్వామి నాయుడు, ఎస్ ఓ సి అహ్మద్ షరీఫ్ ,స్కౌట్ మాస్టర్స్ మిశ్రా ,ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.