బి ఆర్ టి ఎస్ రోడ్డు బాధితులకు న్యాయం చెయ్యాలి : భీమిలి టీడీపీ ఇంచార్జ్, మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ.
సింహాచలం : వి న్యూస్ : నవంబర్ 20:
సింహాచలం బి ఆర్ టి ఎస్ రోడ్డు బాధితులకు పునరావాసం కల్పించకుండా టిడిఆర్లు నష్టపరిహారం ఇవ్వకుండా వారి ఇళ్ళను తొలగించడంపై స్పందిస్తూ జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించిన కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కోరాడ రాజబాబు గత రెండు రోజులుగా సింహాచలం బి ఆర్ టి ఎస్ రోడ్డు విస్తరణ బాధితులకు పునరావాసం కల్పించకుండా భయభ్రాంతులను గురిచేస్తూ వారిపై దాడులు చేసి మరి ఇల్లను కూల్చివేసే చర్యను తప్పుపడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంకు వెళ్లి జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించే కార్యక్రమంలో కోరాడ రాజబాబు పాల్గొనడం జరిగింది అలాగే మీడియా తో మాట్లాడుతూ సింహాచలం తొలి పావంచ నుంచి పాత అడివి వరం వరకు టిడిఆర్ లు ఇవ్వకుండా భవనాలను కూల్చివేయడం చాలా దుర్మార్గం 14వ తారీఖున అభ్యంతరాలు తెలియజేయడానికి 15 రోజులు టైం ఇస్తూ ప్రకటన ఇచ్చి తొలగించవలసిన ఇళ్లకు నాలుగు టిడిఆర్లు ఇస్తామని ప్రకటిస్తూ ఇప్పుడు నోటీసులు ఇచ్చే నాలుగు రోజులు గడవకుండానే అన్యాయంగా పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం అత్యంత దుర్మార్గమైన చర్య ఈ చర్యకు పాల్పడిన కమిషనర్ మరియు స్థానిక శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేద ప్రజల బతుకులతో ఇంత పాసివికంగా ఆడుకోవడం సరికాదని వెంటనే ఈ బాధితులందరికీ పునరావాసం కల్పించి నష్టపరిహారం అందించి అన్ని విధాల ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితోపాటు మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి, కొండ్రు మురళీ, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, మాజీ శాసనసభ్యులు గండి బాబ్జి,పీల శ్రీను, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు,లోడగల కృష్ణ,విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్,రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మొల్లు లక్ష్మణరావు, రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రణవ గోపాల్, 98వ వార్డ్ పార్టీ అధ్యక్షులు పంచదారల శ్రీనివాస్ రావు,తదితర నాయకులు పాల్గొన్నారు.

