మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ ఇచ్చిన హామీనీ అమలు చేయాలి. సిఐటియు డిమాండ్.
మధురవాడ జోనల్ కార్యాలయం : వి న్యూస్ : నవంబర్ 20:
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోయినసారి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పర్మినెంట్ చేయాలని, అప్పటివరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏపీ మున్సిపల్ ఔట్సోర్సింగ్ అండ్ కాంటాక్ట్ కార్మిక సంఘం విశాఖ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎం.వి.ప్రసాద్ డిమాండ్ చేశారు. కార్మికులను శాశ్వత ప్రాతిపదికన తీసుకోవడంతోపాటు అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు మున్సిపల్ కార్మికులతో చేసిన ఒప్పందం ప్రకారం అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మధురవాడ జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి పెద్ద పెట్టున నినాదాలు చేసారు.ధర్నా లో ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ ల వద్ద ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు.
రేపు కలెక్టరేట్ ల వద్ద వంటావార్పు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం, కమిషనర్, ఇతర అధికారులు మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలియజేశారు తెలియజేశారు. గత సమ్మే లో మరణించిన కార్మికల వారసుల కు, అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుల పిల్లలకు, వయసు పైబడిన వారి వారసులకు ఇస్తామన్న ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి రత్నం, మధురవాడ జోన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ రామప్పుడు రా, సి హెచ్ శేషుబాబు,కే ఈశ్వరరావు,కే అర్జునమ్మ,బి నరసింగరావు,పి జాన్ తదితరులు పాల్గొన్నారు.
