ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటును విజయవంతం చేయండి
విశాఖపట్టణం, వి న్యూస్ : నవంబర్ 18:
సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున*విశాఖ వేదికగా రాష్ట్ర స్థాయి క్రీడలు సాగుతాయని వెల్లడి
*విస్తృత ప్రచారం కల్పిస్తూ అధిక మందిని భాగస్వామ్యం చేయాలని పిలుపు
*డిసెంబర్ 15, 2023 నుంచి జనవరి 26, 2024 వరకు ఆడుదాం ఆంధ్ర పోటీలు
*నవంబర్ 20 నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్, నేడు ప్రత్యేక యాప్ విడుదల
యువతీ, యువకులను, విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటును విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున పిలుపునిచ్చారు. వీఎంఆర్డీఏ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన వివిధ విభాగాల అధికారులతో శనివారం సాయంత్రం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా క్రీడల సజావు నిర్వహణకు, విజయవంతానికి అందరూ కలిసి రావాలని, వీలైనంత ఎక్కువ మంది యువతను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి అధిక మందికి క్రీడల్లో చోటు కల్పించాలని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ

