రాష్ట్రంలో రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమే. జగన్ కు రాజకీయ సమాధి కట్టాలి.

రాష్ట్రంలో రాబోయేది ఉమ్మడి    ప్రభుత్వమే. జగన్ కు రాజకీయ సమాధి కట్టాలి.

ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు.

ఎండాడ : వి న్యూస్ 2023 నవంబర్ 17:


రాష్ట్రంలో రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమేనని, సమ సమాజం అన్న మాటకు కనీసం అర్ధం తెలీని వ్యక్తి జగన్ అని,  ఇప్పుడు సామాజిక న్యాయం,సాధికారికత అంటూ బస్సు యాత్రలు చేయడం సిగ్గు చేటు అని విశాఖ జిల్లా జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎండాడ జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆనియోజకవర్గ ఇన్చార్జ్ సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు పరిచయ వేదిక నిర్వహించారు.ఈసందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ...


అబద్దాల కోరు సీఎం జగన్ కు రాజకీయ సమాధి కట్టాలని,అధికారం లో ఉన్న ఒక దుర్మార్గపు పార్టీని ఇంటికి పంపాలని సంకల్పం సిద్ధం చేస్తున్నాం అని, వైయస్సీపీ వారు వేలసంఖ్యలో దొంగ ఓట్లను తయారు చేస్తున్నారని,ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి ప్రజలలో తిరగనివ్వకుండ చేస్తున్నారని,

ముఖ్యమంత్రి స్థాయిలో లక్షల స్థాయిలో సంపాదిస్తే ఎమ్మెల్యే స్థాయిలో వేల స్థాయిలో దోచుకుంటున్నారని,20సం అభివృద్ధి నీ వెనక్కి పంపిన పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ

రాష్ట్రంలో అన్ని వనరులను ఒక్కడినే దోపిడీ చేయాలని ముఖ్యమంత్రి ఆరాటపడుతున్నారు. సంపద సృష్టించక లేక రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని, ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.ఇప్పటికే రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీల కలయికను కొంతమంది జీవించుకోలేకపోతున్నారని,  అట్టివారికి రాబోయే ఎన్నికలలో ప్రజలే సరైన సమాధానం చెప్తారని పేర్కొన్నారు.ఇప్పటివరకు భీమిలి నియోజకవర్గం లో జనసేన పార్టీని అనేక కార్యక్రమాలను వివరించారు. నియోజవర్గం పరిధిలోని ఆ క్రమంలో భూకబ్జాలు పై జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ సందీప్ ను అభినందించారు.2009లో ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ విజయం సాధించిందని,అలాగే 2024జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిని  ఉమ్మడి పార్టీ కార్యకర్తలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు.ఇప్పటినుంచి ప్రతి జనసేన కార్యకర్త సందీప్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. అనంతరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త సందీప్ పంచకర్ల మాట్లాడుతూ.. ఉమ్మడి విశాఖజిల్లాలో వైసీపీ తుడుచుకుపోవడం ఖాయమని,రానున్న రోజుల్లో టీడీపీ జనసేన కలిసి ప్రజల్లోకి వస్తాయని,ఊరు పేరు లేని వ్యక్తులను తమ పార్టీలోకి చేర్చుకొని సంతోషిస్తున్నారని, రానున్న రోజుల్లో టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది సందీప్ పేర్కొన్నారు.నియోజకవర్గ పరిధిలో అనేక సమస్యలపై జనసేన పార్టీ పోరాడింది అన్నారు.అందులో భాగంగా ఎర్రమట్టి దిబ్బల ఆక్రమణ,రుషికొండ వద్ద శాంతి యుత ప్రదర్శన,పాండురంగ బ్రిడ్జిపై నిరాహార దీక్ష, తాటితూరులో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు పై అధికారులు దృష్టిలో తీసుకుని వచ్చేలా ఇలా పలు సమస్య లు పై పనిచేసినట్లు తెలిపారు.అనంతరం నియోజకవర్గం పరిధిలో ఉన్న పలువురు నాయకులను రమేష్ కు సందీప్ పరిచయం చేశారు. ఈకార్యక్రమానికి నియోజకవర్గం సమన్వయ కర్త బీవి కృష్ణయ్య అధ్యక్షుతన వహించారు.ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ ఇ.ఎన్.ఎస్. చంద్రరావు,మీడియో ఇంచార్జ్ నాగోతి నరసింహనాయుడు, నక్కాశ్రీధర్,శాఖరి శ్రీనుబాబు,పోతిన అనురాధ,పరిమి భువనేశ్వరి, పోతిన తిరుమలరావు, తమ్మిన అప్పలరాజు,ఒమ్మి దేవి యాదవ్,పిళ్ళా శ్రీను, ఇద్దిపిళ్లి నానాజి,వాండ్రశి అరవింద్, తాడివాడ ప్రశాంత్,సంతోష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.