వైజాగ్‌లో భారత్ – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్
–ప్రశాంతంగా టిక్కెట్ల విక్రయం.
– కౌంటర్లను పరిశీలించిన ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి
(విశాఖ పియం పాలెం 2023 నవంబర్ 17)ః
వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నవంబర్ 23న భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ–20 మ్యాచ్‌కు ఆఫ్‌లైన్‌లో శుక్రవారం నుంచి టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. పీఎం పాలెంలోని క్రికెట్ స్టేడియం ‘బి’ గ్రౌండ్, వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో పురుషులు, మహిళల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. టిక్కెట్ల కోసం యువత పోటీ పడ్డారు. పీఎం పాలెంలోని క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన టిక్కెట్ల విక్రయ కేంద్రాలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా టిక్కెట్ల కొనుగోలు దారులకు అవసరమైన త్రాగునీరు ఏర్పాటు చేయాలని ఏసీఏ సిబ్బందిని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో టిక్కెట్ల విక్రయానికి సహకరించిన జిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జున, సీపీ రవిశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆఫ్‌లైన్‌లో రోజుకు 5 వేల టిక్కెట్ల చొప్పున విక్రయించేలా ఏర్పాటు చేశామన్నారు. శనివారం కూడా టికెట్లు కౌంటర్లలో అందుబాటులో ఉంటాయన్నారు. రూ. 600, రూ.1,500, రూ. 2000, రూ. 3,000, రూ. 3,500, రూ. 6000 విలువ గల టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లను వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో 22వ తేదీ వరకు, అదేవిధంగా విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్నæ స్టేడి యం ‘బి’ గ్రౌండ్ లో ఉన్న కౌంటర్ లో 23వ తేదీ వరకు రెడీమ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
