నవంబర్ 8 రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ

నవంబర్ 8 రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ.

భీమిలి: వి న్యూస్ : నవంబర్ 05:        

విశాఖ ఉక్కు పోరాటానికి నవంబర్ 8తో 1000 రోజులు అవుతున్న సందర్భంగా, *విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకై* నవంబర్ 8న రాష్ట్రవ్యాప్త *విద్యాసంస్థల బందుకు* విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం భీమిలి లో వున్న బీసీ బాలికల హాస్టల్ మరియు ఎస్ సి బాలుర హాస్టల్లో నిర్వహించడం జరిగింది.

ఈ సంద్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) విశాఖ జిల్లా కార్యదర్శి ఉల్లం .నాగరాజు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పోరాటాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నాయని, 1000 రోజులుగా కార్మికులు, ప్రజలు చేస్తున్న పోరాటాలను పట్టించుకోకుండా స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి నెట్టబడే కుతంత్రాలు చేస్తున్నారన్నారు. మరో వెయ్యి రోజులు అయిన సరే పోరాటాన్ని విరమించేది లేదని BJP మోడీ ని గద్దె దించి స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకుంటామని తెలియజేశారు. అలాగే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా బంద్ కి పిలుపు నిచ్చారు.విద్యార్థులు, ప్రజలు, విద్యా సంస్థల యామాన్యాలు ఈ బంద్ లో స్వచ్చదంగా లక్షలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో AISF జిల్లా అధ్యక్షుడు శ్రీను, నాయకులు జీవన్ ,చరణ్, శివరామకృష్ణ ,తేజ, కామేష్, విద్యార్థి పాల్గొన్నారు.