అట్లతద్దిను పురస్కరించుకొని గౌరీదేవికి మహిళలు ప్రత్యేక పూజలు.

అట్లతద్దిను పురస్కరించుకొని గౌరీదేవికి మహిళలు ప్రత్యేక పూజలు

జగ్గంపేటవి న్యూస్ ప్రతినిధి: అక్టోబర్ 31:

అట్లతద్ది సందర్భంగా జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో స్థానిక మంచినీటి చెరువు దగ్గర గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ముందుగా సాయంత్రం మా గ్రామ మంచినీటి చెరువు దగ్గరకి వచ్చి గౌరీ దేవికి పూజలు చేసి అనంతరం ప్రతి ఒక్కరూ ఇంట్లో  11 అట్లను 11 వాయినాలుగా ఏర్పాటు చేసుకొని పూజలు చేయడం ఎప్పటినుండో ఆచారంగా వస్తుందని తెలిపారు.