చంద్రబాబు విడుదల సందర్బంగా 7వవార్డులో అంబరాన్నంటిన సంబరాలు.
మధురవాడ :వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 31:
7వవార్డ్ టీడీపీ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిళ్ళా వెంకటరావు, జనసేన 7వవార్డ్ జనసేన ఇంచార్జ్ నాగోతి నరసింహనాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యిన సందర్బంగా తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహలతో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం మిఠాయిలు పంచుకుంటూ, బానసంచా కాలుస్తూ జై టీడీపీ, జై టీడీపీ, జై జనసేన, జై పవన్కళ్యాణ్ నినాదాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ మాట్లాడుతూ టీడీపీ అన్యాయంగా అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేకుండా జగన్ 16నెలలు జైల్లో ఉన్నాడని మా నాయకుడు చంద్రబాబు జైల్లో పెట్టి వ్యవస్థలను మేనేజ్ చేసి రాక్షశానందం పొందారని రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు లా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి వైస్సార్సీపీ పార్టీని బూస్థాపితం చేసే రోజులు దగ్గరున్నాయని అన్నారు. జనసేన 7వవార్డ్ ఇంచార్జ్ నాగోతి నరసింహనాయుడు, జనసేన నాయకులు నక్క శ్రీధర్, పోతిన తిరుమలరావు మాట్లాడుతూ, చంద్రబాబు పార్టీలకతీతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ని ఎంతగా అభివృద్ధి చేశారో అందరికి తెలుసనీ, ఇంకా అభివృద్ధి చేస్తున్నసమయంలో రాక్షస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని రావానకాష్టం చేసారని అన్నారు.అన్యాయంగా ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్ అయ్యి నేడు మంధ్యన్తర బెయిల్ పై విడుదల అయ్యి వచ్చిన శుభసందర్భంగా టీడీపీ, జనసేన సభ్యులు కలిసి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకుంటూ, బానాశంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నామని, జనసేన అధినేత ఆశయంతో టీడీపీ సభ్యులతో కలిసి రానున్న ఎన్నికలలో జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసి వైస్సార్సీపీ నాయకులకు బుద్దిచెప్పటానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ 7వ వార్డ్ కార్యదర్శి కానూరి అచ్చుతరావు, టీడీపీ సీనియర్ నాయకులు నాగోతి సూర్య ప్రకాష్, 7వవార్డ్ మహిళా అధ్యక్షురాలు నోడగల భవాని,7వవార్డ్ జనసేన ఇంచార్జ్, నాగోతి నరసింహ నాయుడు, పిళ్ళా శ్రీనివాస్,నక్క శ్రీధర్, పోతిన తిరుమల రావు, జగుపిల్లి నాని, పేకేటి శ్రీనివాస్,కొల్లి శంకర్ పి. గంగరాజు, పట్నాల త్రినాధ్, వి. చిన్న, ఈ వెంకటేష్,సంకబత్తుల సతీష్, బంక వాసు, హేమంత్, రెడ్డి రాజు తదితర టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

