వైసిపి పాలనలో దళితులపై జరుగుతున్న దాడులపై నిరసన తెలియజేసిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరడ రాజబాబు

వైసిపి పాలనలో దళితులపై జరుగుతున్న దాడులపై నిరసన తెలియజేసిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరడ రాజబాబు

భీమిలి: వి న్యూస్ :నవంబర్ 05: 

భీమిలి నియోజకవర్గ పరిధి తగరపువలస అంబేద్కర్ కూడలిలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పతివాడ రాంబాబు  ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల గ్రామంలో శ్యాం కుమార్ అనే దళిత యువకుడిపై పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్సీపీ కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు దౌర్జన్యంగా కారు ఎక్కించి కిడ్నాప్ చేసి నాలుగు గంటలు కారులో నిర్బంధించి నానారకాలుగా హింసిస్తూ ఇబ్బందులకు గురి చేయటం వల్ల శ్యాం కుమార్ దాహంతో మంచినీళ్లు అడగగా వారి మూత్రాన్ని నోట్లో పోసి తీవ్రంగా అవమానించి మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురిచేసిన ఘటనకు స్పందిస్తూ దళితులపై జరుగుతున్న దాడుల కోసం భీమిలి నియోజకవర్గ పరిధి తగరపువలస అంబేద్కర్ కూడలిలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని కాపాడాలని వేడుకోవడం జరిగింది. రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ ఎమ్మెల్సీ అనంత బాబు కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అన్యాయాన్ని ప్రశ్నించిన దళిత యువకులు కిరణ్ ,వరప్రసాద్ జడ్జ్ రామకృష్ణ ఇప్పుడు బాధితుడైనటువంటి శ్యామ్ కుమార్ ఇలా బయటపడినవి కొన్నే బయటపడనివి ఇంకెన్నో వెలుగులోకి రావలసి ఉండగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి దళితులపై జరుగుతున్న అరాచక దాడులు ఆపడం మానేసి దళితులను హింసించిన వారిని కూడా తిప్పుకునే మన ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలో నా దళిత సోదర సోదరీమణులు అని పిలుస్తూ దళిత పక్షపాతినని చెప్పుకునే ఈ వైసీపీ ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి బాధితులకు సరైన న్యాయం చేయాలని రాజ్యాంగాన్ని కాపాడాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒకటో వార్డ్ పార్టీ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు రెండో వార్డ్ పార్టీ ప్రెసిడెంట్ బడిగంట నీలకంఠం విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిలకా నర్సింగరావు నరవ రామారావు చెన్న రాజు మద్దిల సుబ్బారావు నరవ రామారావు ఉడికల చంటి మద్దిల వెంకట్రావు తాటిపూడి అప్పలరాజు చెన్నా అప్పలరాజు వసి హరిబాబు సారిపిల్లి సంతోష్ కుమార్ కాకర కిరణ్ పాలుపిల్లి తౌడు రాజు తదితర నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది