ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ మండల మహాసభ

ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ మండల మహాసభ

వి న్యూస్ ప్రతినిధి కూనవరం నవంబర్05: 

కూనవరం మండలం చూచిరేవులగుడెం (భీమవరం ) ఎం.పి.యు.పి..యస్ పాఠశాల నందు ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ మండల మహాసభలను మండల కార్యదర్శి కట్టం వీరయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఏటిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కణితి శేఖర్,కార్యవర్గ సభ్యులు పూసం శ్రీను , జిల్లా అధ్యక్ష ప్రధాన కర్యదర్శులు శ్యామల సుబ్బయ్య,సరియం అనిల్ కుమార్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సి హెచ్.అప్పారావు,సొడే వెంకట్రావు, చిచ్చాడి బాబూరావు,ఐటిడిఎ వింగ్ కార్యదర్శులు సోదే నారాయణ ,సోందే వెంకట్రావు,మండల అధ్యక్షులు చిచ్చడి

జితేంద్ర , ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు .ఈ కార్యక్రమం ను ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ జీ ఓ నెం.3 రివ్యూ పిటిషన్ వేసి వుండగానే..ఏజెన్సీ ఉపాధ్యాయ ప్రమోషన్స్ ఇవ్వడాన్ని తీవ్రం గా ఖండిస్తున్నామని తెలియ. జేశారు.. అదేవిధంగా భవిష్యత్తు లో ఏజెన్సీ ప్రాంతం లో జరిగే ప్రతి నియామకాలను ఏజెన్సీ ఆదివాసులకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

  ఈ కార్యక్రమం లో పూసం శ్రీను గారు మాట్లాడుతూ ..కేవలం ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయులు ఇచే ప్రతీ నిధి మన భవిష్యత్తు ఆదివాసీ బిడ్డలకు ఉపయోగ పడే విధం గా ఉండాలి తప్ప ఇతర గిరిజనేతర ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన చందాల ద్వారా మన కంటితో మనల్నే పొడిచే అవకాశం ఉందని కాబట్టి ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈవిషయాన్ని గుర్తెరిగి సభ్యత్వాలు ,చందాలు ఇవ్వాలని కోరారు.

  ఈ కార్యక్రమం లో జిల్లా ప్రథాన కార్యదర్శి సరియం అనిల్ కుమార్  

ఉపాధ్యాయుల సర్వీసు అంశాలను వివరించి అవగాహన కల్పించారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అప్పారావు,వెంకట్రావు, బాబూరావు గారు మాట్లాడుతూ ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ చారిత్రక నేపథ్యం గురించి సుదీర్ఘంగా వివరించారు.

చివరి గా మండల అధ్యక్షులు జితేంద్ర గారు మండల ఎటిఏ ప్రగతిని వివరిస్తూ ముగింపు కార్యక్రమం పలికారు.