ఏజెన్సీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కొరకు డియస్సీ నోటిఫికేషన్ విడుదల
వి న్యూస్ : నవంబర్ 5 :కూనవరం:
చేయాలి:యు.టి.ఎఫ్.మండల నూతన కౌన్సిల్ డిమాండ్ :5 నవంబర్ 2023 ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల నూతన కౌన్సిల్ సమావేశం విద్యా వనరులు కేంద్రం టేకులబోరు లో మండల అధ్యక్షులు ఎ. నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.నూతన కౌన్సిల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి పిండా.క్రిష్ణయ్య UTF జెండాను ఎగురవేశారు.మండల కౌన్సిల్ నుద్దేశించి జిల్లా నాయకులు పి.క్రిష్ణయ్య,ఎస్.నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని పాఠశాలలో టీచర్ లేక ఖాళీగా ఉన్నాయని తెలిపారు.ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో అధిక సంఖ్యలో సింగిల్ టీచర్లు పనిచేస్తున్నారనీ, దీని వలన విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని వారు ఆరోపించారు.విద్యాప్రమాణాలు మెరుగుపరుచుటకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీ గా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కొరకు "డియస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని యు.టి.ఎఫ్.నూతన కౌన్సిల్ డిమాండ్ చేసింది.ఈ సమావేశంలో UTF నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్ష/ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వరరావు,కన్నారావు, తోపాటు 9మంది కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

