26న కాకినాడలో గోదావరి జిల్లాల సమతా సమ్మేళనం

26న కాకినాడలో గోదావరి జిల్లాల సమతా సమ్మేళనం

వి న్యూస్ : కూనవరం: నవంబర్ 05:

కూనవరం నవంబర్ 05: ఈనెల 26వ తేదీన కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో గోదావరి జిల్లాల సమతా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికిముక్కు సుబ్బయ్య తెలిపారు. ఆదివారం నాడు రొంపచోడవరం నియోజకవర్గం పరిధిలోని విఆర్ పురం మండలంలోని చింతరేగి పల్లి,రేకపల్లి,వడ్డిగూడెం గ్రామాలలో ఈ సమ్మేళనం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ గణపతి ముని సమతా సందేశంకు నూరేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈనెల 26వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడలోని గాంధీనగర్ పార్కు వద్ద సామాజిక సమరసత్వవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తామన్నారు. గోదావరి తీరాన ప్రముఖ సాహితీవేత్త, సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు దంపతులు, సామాజిక సంస్కర్త దానశీలి, పిఠాపురం జమిందార్, వనవాసుల ఆర్థిక అభివృద్ధికి కృషిచేసిన బాలానంద స్వామి అని వివరించారు. ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులు ముమ్మిడివరం పెద్ద, చిన్న బాలయోగులు వనవాసులను సమైక్యపరిచి స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించిన వాళ్లలో అల్లూరి సీతారామరాజు అని గుర్తు చేశారు. ఈ విధంగా సమతా సమాజ స్థాపనకు ఎంతోమంది కృషి చేశారని వెల్లడించారు. వారి సేవలను స్మరించుకుంటూ వారు వదిలి వెళ్ళిన కార్యాన్ని పూర్తి చేయడం మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ సమ్మేళనానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఎఫ్ మండల ధర్మప్రచారక్ శ్రీరామకృష్ణయ్య,డివిజన్ కన్వీనర్ నోముల శ్రీనివాస్,కూనవరం ధర్మప్రచారక్ గీదా శ్రీనివాస్,వడ్డనపు సత్యనారాయణ, ముత్యాల పవన్ కుమార్,రాంగోపాల్,బొర్ర దుర్గాప్రసాద్,హరినాద్ తదితరులు పాల్గొన్నారు.