అభివృద్ధి మరిచారు..పధకాలు పంచారు

అభివృద్ధి మరిచారు..పధకాలు పంచారు..

 వి న్యూస్ :  కూనవరం: నవంబర్ 5:

కూనవరం :సీపీఎం పార్టీ చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర సాయంత్రం కూనవరం మండలనికి చేరుకోగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కి పూల మాలలతో, తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. అనంతరం సభ ప్రాంగనానికి చేరుకున్న ప్రజా నాట్య మండలి కలకారులు బీజేపీ, వైసీపీ, టీడీపీ ప్రభుత్వాల వైఖరిని ఎండ కడుతూ నృత్య రూపకాలు ప్రదర్శించారు.అనంతరం జరిగిన సభకు కొమరం పెంటయ్య అధ్యక్షతన వహించారు.ఈ సభకు ముఖ్య ముఖ్య అతిధి గా హాజరైన సీపీఎం. రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్యుడి నడివిరుస్తుందని అన్నారు. కేవలం కుర్చీల కోసం తప్ప ఈపార్టీ లు ప్రజా ప్రయోజనాలు కోసం పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని వ్యతిరేకంచకుండా టీడీపీ. జనసేన పార్టీ లు అధికారం కోసం పాకులాడు తున్నాయని అన్నారు.అనంతరం వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రజా సమస్యలు పరిస్కారం. అవడంలేదని అన్నారు. పోలవరం వల్ల నాలుగు మండలాలు జల సమాధి అవుతున్నయని అన్నారు.2022వచ్చిన వరదలకు 16 పంచాయితీలలో 56గ్రామాలు సమూలంగా మునిగాయని మండలంలో కేవలం 9 గ్రామాలు మాత్రమే మునగలేదని అన్నారు. ఇంత నష్టం జరిగిన పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించడం లో ప్రభుత్వం విఫల మైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వర్షాలు లేక మండంలో కరువు తాండవిస్తుందని అన్నారు. కూనవరం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు.మండలంలో వర్షాలు పడక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని,నీటి సదుపాయం లేక ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.కరువు మండలంగా ప్రకటించాలని మండలం లోని ప్రజాప్రతినిధులు సీపీఎం రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి కి మెమోరాండం అందించారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రత్యేక సమస్యలతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అన్నారు.పుట్టి పెరిగిన ప్రాంతాన్ని విడిచి వెళ్లే దయనీయ పరిస్థితి ఉందని అన్నారు. లక్షలాది కుటుంబాలు మునుగుతున్న సరైన ప్యాకేజీ పునరావాసం కల్పించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం విఫలo అయ్యాయాని అన్నారు.ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగకుంటే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కిల్లో సురేంద్ర, జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు, ఎస్. ఎఫ్. ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్,జిల్లా కార్య దర్శివర్గ సభ్యులు లోత రామారావు జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, మేకల నాగేశ్వరావు, చింతూరు మండల కార్యదర్శి సీసం సురేష్, సి ఐ టీ యూ జిల్లా కార్యదర్శి పల్లపు వెంకట్, ప్రజానాట్యమండలిరాష్ట్ర కార్య దర్శి మంగరాజు తదితరులు పాల్గొన్నారు