ఎన్ టి ఆర్ సేవా సమితి ట్రస్ట్ మరియు ఎం వి వి ఎస్ మూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళ్లవలస లో జరిగిన మెగా వైద్య శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు
భీమిలి: వి న్యూస్ ప్రతినిధి : నవంబర్ 06 :
భీమిలి నియోజకవర్గ పరిధి భీమిలి రూరల్ మండలం తాళ్లవలస గ్రామంలో ఎన్ టి ఆర్ సేవాసమితి ట్రస్ట్ మరియు ఎం వి వి ఎస్ మూర్తి ట్రస్ట్ తరపున జిమ్ సర్ గీతం వైద్య కళాశాల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి అన్ని రకాల వైద్య పరీక్షలు మరియు నిష్టార్థులైన వైద్యులచే పరీక్షలు చేయించి అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయడానికి నిర్ణయించి మందులు ఉచితంగా పంపిణీ కార్యక్రమం గీతం విద్యాసంస్థల అధినేత విశాఖ పార్లమెంట్ అభ్యర్థి మతుకుమిల్లి భరత్ సౌలభ్యంతో భీమిలి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు డి ఎ ఎన్ రాజు అధ్యక్షతన నిర్వహించిన వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితోపాటు భీమిలి నియోజకవర్గం వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు ఎరబాల అనిల్ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి గుండు చిన్న బాబు తాళ్లవలస ఎంపీటీసీ కోరాడ రమణ విశాఖ పార్లమెంట్ నాగ వంశ సాధికార సమితి అధ్యక్షులు సంకృభుక్త ప్రకాష్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పతివాడ రాంబాబు నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు పాసి త్రినాథ్ కుమార్ ప్రధాన కార్యదర్శి దంతులూరి సిద్ధార్థ వర్మ ఎక్స్ సర్పంచ్ పరశురాం నియోజకవర్గ రైతు ప్రధాన కార్యదర్శి కనకల సూరిబాబు బోని వెంకటరమణ గొలగాని రాము కొయ్య రామకృష్ణ ఎరుసు శంకర్ రెడ్డి కోరాడ సూరిబాబు నాగిరెడ్డి కోసూరి సత్యనారాయణ చుక్క లక్ష్మణరావు చుక్క అప్పల రమణ తదితర మండల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

