త్రాగునీటి చేతి పంపు బోర్లు ప్రారంభించిన 7 వ వార్డ్ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మమరియు రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు

త్రాగునీటి చేతి పంపు బోర్లు ప్రారంభించిన 7 వ వార్డ్ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మమరియు రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు

మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి (నవంబర్ 7): 

జీవీఎంసీ 7 వార్డ్ పరిధిలో పలు ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ  రాష్త్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు  త్రాగునీటి చేతిపంపు బోర్లును ప్రారంభించారు.   వర్షాలు లేక గతం లో ఉన్న చేతి పంపు బోర్లు కు నీరు అందక వార్డులో చాలా చోట్ల బోర్లు పనిచేయడం లేదని, అందుకే త్రాగునీటి కి ఇబ్బంది ఉన్న ప్రాంతాలలో క్రొత్త బోర్లు వేయడం జరిగిందని కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ  అన్నారు. ముఖ్యంగా డాక్ యార్డ్ స్వతంత్ర నగర్ ఉన్న నివాసితులుకు నీరు సరిగా చేరుకోవడం లేదని వాళ్ళు తమ దృష్టికి  తీసుకురావడం జరిగిందని అందుకే ఆయా ప్రాంతాలలో క్రొత్త బోర్లు వేశామని తెలిపారు. వార్డులో త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాలలో మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లేనని తెలియజేశారు. ఇంకా వార్డ్ లో చాలా ప్రాంతాలలో త్రాగునీటి సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తెలియజేయడం జరిగిందని తొందరలోనే అవి కూడా దశలు వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే తమ సమస్య ను పరిష్కరించినందుకు డాక్ యార్డ్ స్వతంత్ర నగర్ నివాసితులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ మరియు రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు ఆలయ కమిటీ సభ్యులు వార్డ్ లో మహిళలు  తదితరులు పాల్గొన్నారు .