సామాజిక సాధికారిక బస్సుయాత్ర 2024 వైసిపి విజయోత్సవ యాత్రలా ఉంది: సూర్య బలిజ సంఘం డైరెక్టర్ మద్దుల ఛాయాదేవి.

సామాజిక సాధికారిక బస్సుయాత్ర 2024 వైసిపి విజయోత్సవ యాత్రలా ఉంది: సూర్య బలిజ సంఘం డైరెక్టర్ మద్దుల ఛాయాదేవి.

వైసిపి విజయోత్సవ బస్సు యాత్రలో మహిళలు

మధురవాడ (పెన్ షాట్ అక్టోబర్ 28 న్యూస్) : 

సామాజిక సాధికారిక బస్సుయాత్ర చేస్తుంటే వైసిపి విజయోత్సవ యాత్రల ఉందని మధురవాడకి చెందిన సూర్య బలిజ సంఘం డైరెక్టర్ మద్దుల ఛాయాదేవి అభిప్రాయం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా మంత్రులతో కలిసి నిర్వహిస్తున్న సామాజిక సాధికారిక బస్సు యాత్రలో ఆమె పాల్గొన్నారు, ఇప్పటివరకు ఇచ్చాపురం, గజపతినగరాలలో యాత్రను పూర్తిచేసుకుని శనివారం భీమిలి నియోజకవర్గం జరిగిన యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బస్సు యాత్ర ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేయగలుగుతున్నామని అదేవిధంగా 2024లో వైసిపి అధికారంలోకి రావడం తద్యమని పేర్కొన్నారు. అలాగే ఈ బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమం అందించడంలో వైసీపీ ముందుందని గుర్తు చేశారు. ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలు మరింత దగ్గరయ్యారని ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. యాత్రలో యాత సంగం చైర్పర్సన్ పిల్లి సుజాత, నగరాల చైర్ పర్సన్ పిల్లా సుజాత సత్యనారాయణ, కారణాల సంఘం చైర్పర్సన్ కే.అనూష తదితరులు పాల్గొన్నారు