వైఎస్సార్ సీపీ సామజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించిన ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి

వైఎస్సార్ సీపీ సామజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించిన ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి

మధురవాడ: వి న్యూస్ : అక్టోబర్ 28:

వెనకబడిని వర్గాలని కలుసుకుని గడిచిన నాలుగు సంవత్సరాల్లో జరిగిన మంచిని గుర్తుచేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో జరుగుతున్న సామాజికి సాధికార బస్సు యాత్ర శనివారం చంద్రంపాలెం, మధురవాడలో ప్రారంభమైంది. వైస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులూ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి దీనిని ప్రారంభించారు. నాడు - నేడులో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ మధురవాడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. తదనంతరం అక్కడి విద్యార్థులు, ఉపాద్యాయులతో సంభాషించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సాయంత్రం తగరపువలస బంతాట మైదానంలో మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మత్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, కే కే రాజు, తదితర వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.