వైసిపి ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రను వ్యతిరేకిస్తూ నల్ల బెలూన్లు ప్రదర్శించిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు

వైసిపి ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రను వ్యతిరేకిస్తూ నల్ల బెలూన్లు ప్రదర్శించిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు

భీమిలి : పెన్ షాట్ ప్రతినిధి : అక్టోబర్ 28:

శనివారం భీమిలి చిన్న బజార్ కూడలిలో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు (NTR) విగ్రహం దగ్గర వై సి పి ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక సాధికార బూటకపు బస్సు యాత్రను వ్యతిరేకిస్తూ నల్ల బెలూన్లు పట్టుకొని ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తున్న భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు. బస్సు యాత్ర రాష్ట్రప్రజలకు ఏమి చేశారని యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. యువతకు జాబ్ క్యాలెండరు విడుదల చేసి ఉద్యోగాలిచ్చారణ? మధ్యపాన నిషేధం చేసి ఆడపడుచులకు ఇచ్చిన మాట నెరవేర్చ్చారనా? పోలవరం 72% పూర్తి అయ్యిన పూర్తిచేశారనా? ఉద్యోగులకు వారం రోజుల్లో సి పి ఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసినందుకా? ఈ బస్సు యాత్ర అంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కొట్ని బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, భీమిలి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు డి ఏ ఎన్ రాజు, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మొల్లి లక్ష్మణరావు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి పిల్లా వెంకట్రావు, విశాఖ పార్లమెంట్ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి వాండ్రాసి అప్పలరాజు, రాష్ట్ర పద్మశాలి సాధికార కమిటీ సభ్యులు వానపల్లి సత్య, విశాఖ పార్లమెంట్ అధికార ప్రతినిధి దాసరి శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గాడు అప్పలనాయుడు, సరగడ అప్పారావు మీసాల సత్యనారాయణ చిలక నర్సింగరావు సెక్రటరీ నాగోతి సూర్య ప్రకాష్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.