పీఎంపాలెం : వి న్యూస్ : అక్టోబర్ 31 :
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన నేపథ్యంలో తెలుగు యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ జోన్ 2 పరిధి 6వవార్డు పిఎంపాలెంలో న్యాయం గెలిచింది అంటూ పెద్ద ఎత్తున ఆనందోత్సాహ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా బానా సంచాలు కాలుస్తూ చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం గురునాథ్ మాట్లాడుతూ అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాపార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారనీ, సుమారు 53రోజులు అన్యాయంగా జైల్లో పెట్టీ ఈ ప్రభుత్వం నాయకులు పైశాచిక ఆనందాన్ని పొందారని తెలిపారు. ఈరోజు అయన బయటకు రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వార్డు బీసీ సెల్ అధ్యక్షులు రెడ్డి సత్యన్నారాయణ మాట్లాడుతూ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇప్పుడు నుంచి అసలైన యుద్ధం మొదలవుతుంది అని అన్నారు. కార్యక్రమంలో పోతిన రఘు, వార్డు మహిళ అధ్యక్షురాలు పెంటకోట బబ్బెలు, పోలిశెట్టి నాగేశ్వర రావు, రామకృష్ణ, జనసేన నాయకులు సంతోష్ నాయుడు, అబ్దుల్ భాష, బాబ్జీ, సూరిబాబు, తాడేల శ్రీను, నక్కా రమణ, బానుచారి, వాండ్రాసీ శ్రీను, రౌతు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.