రోలర్ స్కేటింగ్ లో మెరిసిన తెలుగోడు
విశాఖ రూరల్ మధురవాడ (వి న్యూస్ అక్టోబర్ 28 ) :
కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని ఓ యువకుడు నిరూపించాడు. శుక్రవారం చైనాలో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో విశాఖకు చెందిన గీతం ఇంజనీరింగ్ విద్యార్థి కంచరపు వైష్ణవ వేమం పతకాలు కొల్లగొట్టాడు. ఇన్ లైన్ కేటగిరి అలాగే పెయిర్ క్యాటగిరీలో బ్రొంజ్ మరియు వెండి పతకాలు అందుకొని చైనా గడ్డపై తెలుగోడి సత్తా చాటాడు. పదేళ్ల కృషి పట్టుదల కారణంగానే ఈ రెండు విభాగాలలో పతకాలు సాధించి దేశ గౌరవం నిలబెట్టారు. రానున్న కాలంలో మరిన్ని ఛాంపియన్షిప్లు గెలిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే తనకు స్కేటింగ్లో మెలకువలు నేర్పిన గురువులు సత్యనారాయణ, చిట్టిబాబులకు ధన్యవాదాలు తెలిపారు. తల్లిదండ్రులు రామ గోవింద్, సంతోషి లక్ష్మీల ప్రోత్సాహంతో ఈ సాధించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

