ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేయడం దుర్మార్గుపు చర్య జనసేన నాయకులు బివి కృష్ణయ్య

ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేయడం దుర్మార్గుపు చర్య జనసేన నాయకులు బివి కృష్ణయ్య

భీమిలి : పెన్ షాట్ ప్రతినిధి : అక్టోబర్ 28:


ఏపీఎస్ఆర్టీసీ విధుల్లో ఉన్న డ్రైవర్ను కొందరు దుండగులు దాడి చేసి గాయపర్చడం దుర్మార్గపు చర్యని జనసేన నాయకుడు బివి కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ డ్రైవర్లు తమ కుటుంబ సభ్యులను వదిలిపెట్టి మూడు నాలుగు రోజులు డ్యూటీ చేసి తిరిగి ఇళ్లకు చేరుతారని, ఇంటికి వచ్చేంతవరకు కుటుంబ సభ్యులు భయం తోనే ఉంటారని క్షేమంగా ఎటువంటి ఆపద కలగకుండా చేరుకోవాలని కోరుకుంటూ ఉంటారని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికులకు తమ ప్రాణాలు అడ్డు వేసి గమ్య స్థానాలకు చేరుస్తారని అటువంటివారిపై దాడి చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి వెంటనే శిక్షించి డ్రైవర్ కి న్యాయం చెయ్యాలని ఆయన పేర్కొన్నారు.