పోయిన చరవాణిని 10నిముషాలలో పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించిన భీమిలి పోలీసులు.
భీమిలి :పెన్ షాట్ ప్రతినిధి :అక్టోబర్ 27:
శుక్రవారం మధ్యాహ్నం 1:00 సమయంలో గరికిన కనక అనే మహిళ తమ యొక్క చరవాణిను భీమిలి గంటస్తంభం దగ్గర పోగొట్టుకోవడంతో వెంటనే విషయాన్ని పోలీస్ స్టేషన్ కి తెలియజేయగా వెంటనే పోలీసులు స్పందించి 10 నిమిషాల్లో చరవాణి ని వెతికి గరికిన కనకకి అందచేశారు. సకాలంలో స్పందించి తన చరవాణిని తనకు అప్పగించిన పోలీసులకు కనక కృతజ్ఞతలు తెలిపారు.
