రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడో వసంతంలోకి అడుగుపెట్టిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోలాట బృందం
విశాఖ జిల్లా మధురవాడ :వి న్యూస్అక్టోబర్ 27:
ప్రస్తుత కాలంలో ప్రాచీన కళలకు తగిన గుర్తింపు లేకపోవడం ఆ కలల వైపు ఎవరు ఆసక్తి చూపించడం లేదు. ప్రాచీన కాలంలో చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రస్తుతం సినిమా పాటలకి కొన్ని అసభ్యకరమైన పాటలకు ప్రదర్శనలు చేస్తున్నారు . ఈ తరుణంలో ప్రాచీన కాలం నాటి కలకు తగిన గుర్తింపు రావాలని శ్రీ లక్ష్మీనరసింహ కోలాట గురువు సిరిపురపు సంతోషి కొందరు మహిళలను చేర్చుకుని వారికి ప్రాచీన కాలం నాటి కోలాటం నేర్పుతూ హిందూ సంప్రదాయాన్ని ఆధ్యాత్మికత కొరకు ప్రతి ఒక్కరికి తెలిసేలా ప్రదర్శనలు చేస్తున్నారు .చాలామంది సినిమా పాటలకు కోలాటం చేయడం ఇప్పుడు ఒక ఫ్యాషన్ గా మారింది. కానీ సాంప్రదాయం అంటే హిందూ మతాన్ని కాపాడేదని అందుకని హిందూ సాంప్రదాయ ప్రకారం దేవాలయ ప్రాంగణంలో, మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తి పాటలకు ప్రదర్శించాలని సూచిస్తూ కోలాటం ప్రజలందరికీ హిందు సాంప్రదాయం తెలిసేలా మహిళలు కొత్త కొత్త సంస్కృతిక నాట్యంతో కోలాటం ప్రదర్శనలు చేస్తున్నారు...శ్రీ లక్ష్మీ నరసింహ కోలాటం బృందం 2021వ సంవత్సరం విజయదశమి నవరాత్రులలో మొదలై నేటికి రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడో వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శుక్రవారం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం చంద్రంపాలెంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాట బృందంలో ఆధ్యాత్మికతపై ఆశక్తి భక్తి భావంతో తనతో కలిసి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క మహిళకి గురువు సిరిపురపు. సంతోషి సత్కరించి మెమెంటో బహుకరించారు.


