భారత్ ఘన విజయం: ప్రపంచ క్రికెట్ 2023లో భారత్ జైత్ర యాత్ర

భారత్ ఘన విజయం: ప్రపంచ క్రికెట్ 2023లో భారత్ జైత్ర యాత్ర 

భారత్: వి న్యూస్ : అక్టోబర్ 22: 

వరల్డ్ కప్లో వరుస విజయాలతో భారత్ దూసుకెల్తోంది. 

తాజాగా ఆదివారం న్యూజిలాండ్ పై ఇండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

274 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 48 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 

విరాట్ కోహ్లి 95 రన్స్ తో ఇండియా విజయంలో కీ రోల్ పోషించారు. కానీ తృటిలో 49వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. 

భారత్ విజయానికి అవసరమైన పరుగులు 274లో రోహిత్ 46, జడేజా 39, శ్రేయస్ 33, రాహుల్ 27 పరుగులు చేశారు.

బౌలింగ్ లో శమి 5, వికెట్లు కుళదీప్ 02, భూమ్రా 01, సిరాజ్ 01 వికెట్లు తీశారు.

ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు శమి అందుకున్నారు.