జగన్ ప్రభుత్వం పై భవన నిర్మాణ కార్మికుల తిరుగుబాటు తప్పదు.
ఆంధ్రప్రదేశ్: వి న్యూస్ : అక్టోబర్ 01:
ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ హెచ్చరికరాష్ట్రంలో భవన నిర్మాణరంగ కార్మికుల సంక్షేమం కోసం ఎఐటియుసి వీరోచితంగా పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశయడానికి నిర్మాణరంగ కార్మికులందరూ సంసిద్ధం కావాలని ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ పిలుపునిచ్చారు.
ఆదివారం ఉదయం డి.ఎన్.ఆర్ అమర్ భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం ) విజయనగరం జిల్లా జనరల్ బాడీ సమావేశం మజ్జి ఆదిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పడాల రమణ మాట్లాడుతూ తండ్రిని మించిన తనయుడుగా ఉంటానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి తండ్రి పెట్టిన పథకానికి తూట్లు పొడిచి రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికుల కడుపులు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలు తరబడి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996 దేశవ్యాప్తంగా అమలవుతున్నా ఆంధ్రరాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బోర్డును తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కార్మికుల వద్ద నుండి సంక్షేమబోర్డులో సభ్యత్వం పేరుతో, భవన నిర్మాణ యజమానులు దగ్గర నుండి సెస్ పేరుతో వసూలు చేస్తున్న వేల కోట్ల నిధులను *అత్త సొమ్ము అల్లుడు దానం లాగా జి.ఓ నెంబర్ 17 ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు, ఇతర ప్రయోజనాలకు మళ్ళించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కష్టజీవుల పక్షపాతినని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి సుమారుగా 55 వేల క్లెయిమ్ల డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ మా ఎఐటియుసి అనుబంధంగా యూనియన్ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎర్పడినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులను చిన్న చూపు చూడడమే కాకుండా సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసే రద్దు చేయాలనే దుర్మార్గపు ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. ఒక పక్క కరోనా, మరో పక్క ఇసుక దొరక కుండా చేసి, సిమెంటు, ఐరెన్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్న నేపథ్యంలో భవన నిర్మాణరంగం కుదెలు అయిపోయి కార్మికులు కుటుంబాలు గడవక పనులు లేక ఇంటి అద్దెలు కట్టలేక, పిల్లల్ని చదివించుకోలేక, కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు అనేకమంది కార్మికులు ఆత్మహత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం మనసు కరగలేదా అని మండిపడ్డారు. కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి కష్టాన్ని మరింతగా పెంచి గడప గడప వైసిపి అని సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన 1200 కోట్లు సంక్షేమ బోర్డు నిధులను వెంటనే బోర్డుకి జమ చేయాలని. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మిక నిధులను వారి ప్రయోజన కోసం ఖర్చు పెట్టాలని, ఇష్టానుసారంగా పెంచుకుపోతున్న స్టీలు, సిమెంటు, రా మెటీరియల్ మొదలైన ధరలను నియంత్రించాలని డిమాండ్లతో జరుగుతున్న పోరాటాలకు మరింత బలాన్ని కూడగట్టుకుని రానున్న ఎన్నికలలో మళ్ళీ ఓట్ల కోసం వచ్చే నాయకులను మా బోర్డులో కాజేసిన డబ్బులు నాకు తిరిగి ఎప్పుడు ఇస్తారని నిలదీయాలని అన్నారు.
ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్యేల నుండి మంత్రులకి, ముఖ్యమంత్రి వరకు, జిల్లా రెవెన్యూ, లేబర్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ఆందోళన చేస్తున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది భవన నిర్మాణ రంగంలో వివిధ రకాల పనులు చేస్తున్న కార్మికులు భవిష్యత్తు వేల కోట్ల రూపాయల ఆదాయం కలిగిన సంక్షేమ బోర్డు విధివిధానాలపై చర్చించి పరిష్కారం చేయాలన్న ఆలోచన లేకపోవడం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యానికి నిదర్సనమన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రాజన్న బిడ్డ అనిపించుకోవాలి అంటే 1996 చట్టాన్ని గౌరవించి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సంక్షేమ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించి గత ప్రభుత్వాలు మాదిరిగ ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు సౌకర్యాలను కల్పించాలని డిమాండ్లతో భవిష్యత్తు లో జరగబోయే పోరాటాల్లో భవన నిర్మాణ కార్మికులు అందరూ భాగస్వామ్యo కావాలని కోరారు.
అనంతరం యూనియన్ జిల్లా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్.రంగరాజు, జిల్లా అధ్యక్షుడు మజ్జి ఆదిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలి గౌరి నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు గురువా రెడ్డి, చీపురుపల్లి వి.శంకర్రావు, సహాయ కార్యదర్శులు పులిబంటీ శ్రీనివాసరావు, కెల్ల సూరినాయుడు, కోశాధికారి పురం అప్పారావు లను సమావేశంలో ప్రతినిధులు ఏకగ్రవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా కార్యదర్శులు డేగల అప్పలరాజు, పురం అప్పారావు, బాలి గౌరి నాయుడు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. గురువారెడ్డి, కెల్ల సూరినాయుడు, పులిబంటి శ్రీనివాసరావు మరియు విజయనగరం, కొత్తవలస, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి మండలాల నుంచి కార్మికులు పాల్గొనడం జరిగింది.

