బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు నృత్య నీరాజ‌నం అర్పిస్తూ క్రియేటివ్ సోల్ నిర్వ‌హిస్తున్న దాండియా పండుగ

బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు నృత్య నీరాజ‌నం అర్పిస్తూ క్రియేటివ్ సోల్ నిర్వ‌హిస్తున్న దాండియా పండుగ

బెజ‌వాడ: వి న్యూస్ : అక్టోబర్ 01: 

బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు నృత్య నీరాజ‌నం అర్పిస్తూ క్రియేటివ్ సోల్ నిర్వ‌హిస్తున్న దాండియా పండుగ ఘనంగా ప్రారంభమైంది. విజ‌య‌వాడ వాసుల‌కు వినూత్న అనుభూతిని మిగుల్చుతూ 2017 నుండి వేడుక సాగుతుండగా, సాంప్ర‌దాయ వ‌స్త్రాలతో చిన్న పెద్ద క‌లిసి చేసిన దాండియా, గ‌ర్బా నృత్య‌రీతులు అందరినీ అలరించాయి. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వేన్షన్ సెంటర్ వేదికగా దాండియా వర్క్ షాపు నిర్వహిస్తుండగా, ఆదివారం ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ పొందిన క‌ళాకారులు చేసిన నృత్య రీతులు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేసాయి. ఆరు సంవ‌త్స‌రాల చిన్నారుల మొద‌లు, అర‌వై సంవ‌త్స‌రాల వృద్దుల వ‌ర‌కు అదిరేటి వస్త్రాలతో ఉత్సాహంగా ప‌దం పాడుతూ క‌దం తొక్కారు. క్రియేటివ్ సోల్ నిర్వ‌హిస్తున్న ఈ వేడుక‌తో బెజ‌వాడ పుర ప్ర‌జ‌ల‌కు దాండియా, గ‌ర్బా నృత్యాల‌తో అనిర్వ‌చ‌నీయ‌మైన అనుబంధం ఏర్ప‌డింది.
ప్రదర్శనకు ముఖ్య అతిధిగా హాజరైన సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను ఆంధ్రప్రదేశ్ కు పరిచయం చేసిన క్రియోటివ్ సోల్ వ్యవస్ధాపలకులు సుమన్ మీనా, నెహా జైన్ అభినందనీయిలన్నారు. కళలతో దేశసమైఖ్యతను చాటేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నగర వాసులు మంచి సహకారం అందిస్తున్నారన్నారు. దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా ప్రదర్శిస్తారన్నారు.  

క్రియేటివ్ సోల్ వ్య‌వ‌స్ధాప‌కులు సుమ‌న్ మీనా, నేహా జైన్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ న‌గ‌ర ప్ర‌జ‌ల నుండి ల‌భిస్తున్న ప్రోత్సాహం మ‌రువ‌లేనిద‌న్నారు. ఈ ఆద‌ర‌ణ త‌మ‌కు మ‌రింత ఉత్సాహాన్ని ఇచ్చింద‌ని దసరా వేడుకల సందర్భంగా ఈ సంవ‌త్స‌రం అమ్మ‌వారికి మ‌రింత ఘనంగా నృత్య నీరాజ‌నం అర్పించేందుకు తమ బృందం సిద్దం అవుతుందన్నారు. లబ్బీపేట ఎస్ ఎస్ కన్వేన్షన్ లో అక్టోబరు 15వ తేదీన జరిగే మెగా ఈవెంట్ కు ముంద‌స్తుగా ఎంట్రీపాస్‌లు తీసుకుని హాజ‌రు కావ‌చ్చ‌న్నారు.