రైతునేస్తం పురస్కారానికి ఎంపికైన బంగారు ఝాన్సీ
విజయవాడలో ప్రదానం చేయనున్న పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
వెళ్లువెత్తుతోన్న ప్రశంసల వర్షం
(విశాఖపట్నం- మధురవాడ: ఆక్టోబర్4):
ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ డాక్టర్ ఐ.వి సుబ్బారావు రైతునేస్తం పురస్కారం దక్కడం టెర్రస్ గార్డెనిస్ట్, సంప్రదాయక ఆర్గానిక్ ఉత్పత్తల ప్రజావగాహన-చైతన్యం., ఆర్గానిక్ మిద్దె తోటల విస్తృత ప్రచార దీప్తి-స్ఫూర్తిగ రెండు తెలుగు రాష్ట్రాల యువ కర్షక నేస్తం ఝాన్సీ బంగారు నిలిచి మెరిసారు. మధురవాడ నగరానికి చెందిన మిద్దె తోట నిర్వాహకురాలు బంగారు ఝాన్సీకి దక్కిన ఈ అపూర్వ గౌరవం తాము కూడా దక్కించుకున్నారు రంగంలో అనుబంధం ఉన్న వార్త మురికి పోతున్నారు.
పద్మశ్రీ పురస్కార గ్రహీత ,రైతునేస్తం ఎడిటర్ యడ్లపల్లి వెంకటేశ్వరావు విషయంను ప్రకటించారు. అక్టోబర్ 14వ తేదీన స్వర్ణభారత్ ట్రస్ట్ ,ఆత్కూరు ,గన్నవరం ,కృష్ణాజిల్లాలో ఈ పురస్కారాన్నిభారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బంగారు ఝాన్సీ రాణి అందుకోనున్నారు. రైతు విభాగంలో 15 మంది ,శాస్త్రవేత్తల విభాగంలో 14 మంది ,విస్తరణ విభాగంలో 15 మందిని పురస్కార గ్రహీతలుగా రైతునేస్తం వారు ప్రకటించారు. గత ఎనిమిదేళ్లుగా నగరంలోని మధురవాడలో అతి తక్కువ స్థలంలో మిద్దె మీద సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ బంగారు ఝాన్సీ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు . ఇప్పటికే నగరానికి చెందిన పలువురు ప్రముఖులందరూ మిద్దె తోటను సందర్శించి ప్రశంసించారు. అలాగే పలు పత్రికలు,జాతీయ,అంతర్జాతీయ న్యూస్ ఛానెల్స్ లో కథనాలు కూడా వచ్చాయి . దీంతో అనేక మంది ఆమె నిర్వహిస్తున్న మిద్దె తోటను సందర్శించి ప్రోత్సహిస్తున్నారు. సేంద్రియ విధానంలో పండించే కూరగాయలు,పండ్లు ,ఆకుకూరలు,పువ్వులను చుట్టుపక్కల వారికి అందరికీ అందించడంతో పాటుగా మిద్దె తోట పెంపకంపై శిక్షణ ఇస్తూ మరోవైపు పర్యావరణానికి అవసరమైన పచ్చని చెట్లు పెంచుతూ వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని అందరికి తెలియజేస్తున్నారామె. ఈ తరుణంలో బంగారు ఝాన్సీ కి రైతునేస్తం పురస్కారం ప్రకటించడం పట్ల అభినందనలు ఆమెను ఉక్కిరి చేస్తున్నాయి. మరింత యశస్సు ఉషస్సలతో వెల్లువెత్తుతూ మరింత సంతృప్తితొ నిండు నూరేండ్లు జాహ్నవి వర్ధిళ్లాలని విశాఖ సహిత ఉత్తరాంధ్రులూ తెలుగు రాష్ట్రాల ఆకాంక్షగ వ్యక్తం చేస్తున్నారు.

.jpeg)
