ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

అనంతపురం: వి న్యూస్ : అక్టోబర్ 02: 

జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలను ఆమ్ ఆద్మీ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ ఆఫీసు నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం పండ్లను మిఠాయిలు పంచిపెట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు పార్టీ కార్యకర్తలతో కలిసి చీపురు పట్టి తాడిపత్రి పట్టణ పురవీధుల్లో చెత్తను ఉడుస్తూ పరిసరాలను పరిశుభ్రంగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలంటే చీపురు పట్టాలి అలాగే నేడు మన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఉన్న అవినీతిని అంతం చేయడానికి, అలాగే అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ చీపురు చేత పట్టాలని పిలుపునిచ్చారు.,ప్రతి ఒక్కరూ కూడా గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎక్కువగా గాంధీజీ స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిస్తే దేశం బాగుంటుందని, నేటి రాజకీయ నాయకులు పూలమాలు వేసిన రెండు నిమిషాల్లోనే గాంధీజీ ఆశయాలు మర్చిపోతున్నారు అని,ఇది చాలా బాధాకరంఅని,భావితరాకోసం మనం ఏమి చేశామో,వారికి ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితిలో నేటి రాజకీయ నాయకులు ఉన్నారు అని ఆయన అన్నారు. ఇకనైనా మన భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు మరియు మన దేశ రెండవ మాజీ ప్రధాని అయిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి చెప్పినట్లు జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని సైనిక పరంగా, దేశం కోసం భావితరాల కోసం సస్యశ్యామలమైన వ్యవసాయం కోసం,దేశం కోసం, పారిశ్రామికంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని తద్వారా నిరుద్యోగ సమస్య లేకుండా చేయడం కోసం పాటుపడాలని అని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఇదే రోజున ఆయన జయంతి సందర్భంగా ఆయన కూడా ఘనంగా నివాళులు అని, అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో రాజకీయ నాయకులు పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వేణుగోపాల్, అమర్నాథ్, కుల్లాయప్ప, శ్రీనివాస్, హుస్సేన్ బి, పవన్, రాజేష్ కుమార్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.