ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించిన కార్పొరేటర్ మొల్లి హేమలత*
మారికవలస: వి న్యూస్ : అక్టోబర్ 01:
ఆదివారం 5 వ వ వార్డు పరిధి లోగల మారికవలస గ్రామం సచివాలయాల 35 పరిధిలో 5 వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏక్ తారీకు ఏ గంట స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉందని, దానిని ఇంకా ముందుకు తీసుకువెల్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ కాకర శ్రీను మరియు శానిటరీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గాయత్రి విద్యా పరిషత్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది.స్థానిక ప్రజలు పాల్గొన్నారు* .
