సత్యం,స్వేచ్ఛ, సమానత్వం,స్వాతంత్య్రం కోసం అహింస మార్గంలో పోరాడిన మహోన్నత వ్యక్తి గాంధీ మహాత్ముడు.

సత్యం,స్వేచ్ఛ, సమానత్వం,స్వాతంత్య్రం కోసం అహింస మార్గంలో పోరాడిన మహోన్నత వ్యక్తి గాంధీ మహాత్ముడు.

5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత

మధురవాడ: వి న్యూస్ : అక్టోబర్ 02: 

గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఐదో వార్డ్ బొట్టవానిపాలెం లో గల టిడిపి ఆఫీసు నందు కార్పొరేటర్ మొల్లి హేమలత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం హేమలత మాట్లాడుతూ సత్యం స్వేచ్ఛ అహింస సమానత్వం స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి అహింసా మార్గంలో పోరాడిన మహోన్నత వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ మహాత్ముడని,ఆ మహనీయుని మార్గంలోనే అందరూ నడవాలని, ఆయన చూపిన బాటనే అందరూ అనుసరించాలని తెలిపారు. ఈరోజు ఆ మహనీయుని మార్గంలోనే మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తన అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేపడుతున్నారని, అలాగే రాష్ట్రంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గాంధీయా మార్గంలో ఈ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు చేపడుతున్నారని,అతి తొందర్లోనే న్యాయం గెలుస్తుందని చంద్రబాబు గారు కడిగిన ముత్యo లా తమ నిజాయితీని నిరూపించుకొని బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, టిడిపి భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడు, నమ్మి వాసు,టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.