ఘనంగా గాంధీ జయంతి వేడుక. సత్యం,అహింస మార్గముతోనే స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహాత్ముడు గాంధీ.: లయన్ డొంకాడ అనిల్ కుమార్

ఘనంగా గాంధీ జయంతి వేడుక. సత్యం,అహింస మార్గముతోనే స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహాత్ముడు గాంధీ.: లయన్ డొంకాడ అనిల్ కుమార్

మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి: అక్టోబర్ 02: 

 పి.ఎం.పి.శ్రీహెల్ప్ఆల్ అసోసియేషన్ కార్యాలయం,పీ.ఎం.పాలెం లో అధ్యక్షులు లయన్ డొంకాడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సాయిబాబా ఆలయంలో నారాయణ సేవ నిర్వహించడం జరిగింది.ఈసందర్భంగా లయన్ డొంకాడ అనిల్ కుమార్ మాట్లాడుతూ..సత్యం,అహింస మార్గముతోనే స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహాత్ముడుగాంధీ అని కొనియాడారు.స్వాతంత్ర సాధన కొరకు అహింస అనే సిద్ధాంతాన్ని నమ్మి బ్రిటిష్ వారిపై అహింస మార్గంలోనే పోరాడారని తెలిపారు. గాంధీ కలలగన్నా భారతదేశాన్ని మనం ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు.ఈకార్యక్రమానికి జనరల్ సెక్రెటరీ మండవకురిటీ లక్ష్మి, కోశాధికారి గొడబసతీష్ కుమార్, సహాయక కార్యదర్శి ఏలూరు సంతోష్ కుమార్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.