ఆనందపురం మండలoలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 73వ జన్మ దిన వేడుకలు.
ఆనందపురం: వి న్యూస్ : సెప్టెంబర్ 18:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 73వ జన్మ దిన సందర్భంగా ఆనందపురం మండలoలో విశాఖ జిల్లా కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో, బిజేపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్, మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు ఆధ్వర్యంలో మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోడీ తొమ్మిది సంవత్సరాల అభివృద్ధిపై చర్చించడం జరిగింది. ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు విశ్వకర్మ యోజన పథకం ప్రవేశపెట్టడం జరిగింది 18 సేతివృత్తులు వారికి ఐదు శాతం వడ్డీ చొప్పున ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇస్తారు ఈ పథకం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు :- విశాఖ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు యోలూరు ధర్మవతి,కే.శివ ప్రసాదరావు,కిసాన్ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు బోర శ్రీను,పి.సాయి రమేశ్,మండల ప్రధాన కార్యదర్శి పి.చిన్న రావు,కే.వి.వి.సూర్య నారాయణ పొన్నాడ గురయ్యా,బిజేపి కార్యకర్తలు పాల్గొన్నారు
