విశాఖ లో భీమిలి జనసేన నేతృత్వంలో వినూత్న నిరసన
భీమిలి: వి న్యూస్ : సెప్టెంబర్ 18:
విశాఖలో భీమిలి జనసేన నేతృత్వంలో వినూత్న నిరసన చేసారు. విశాఖ మానసిక వైద్యశాల వద్ద జనసేన నేతలు నినాదాలతో నిరసన చేసారు. భీమిలి జనసేన ఇంచార్జి డాక్టర్ పంచకర్ల సందీప్ నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్,మంత్రులు రోజా,అంబటి రాంబాబు తీరును జనసేన నేతలు ఖండించారు. భీమిలి జనసేన నేత డాక్టర్ పంచకర్ల సందీప్ మాట్లాడుతూ సీఎం జగన్ కనీసం చూసి కూడా స్క్రిప్ట్ చదవలేక పోతున్నారని విమర్శించారు. ములాఖత్ పదాన్ని కూడా మూలగకాడ అనేలా పలుకుతున్నారని అన్నారు. ఒక్కసారి సీఎం జగన్, మంత్రలు రోజా, అంబటి రాంబాబు ల, ఆరోగ్య పరిస్థితి సరి చూడాలని విశాఖ మానసిక వైద్యశాల ఎదుట నిరసన తెలిపారు. గెట్ విల్ సూన్ రోజా, అంబటి, అంటూ నినాదాలు చేసారు. ఈ కార్యక్రమం లో భీమిలి జనసేన నాయకులు శేఖరి శ్రీనివాస్, దేవియాదవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
