మధురవాడ 5వ వార్డ్ లో టీడీపీ కాగడాల ప్రదర్శన

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ 5వవార్డ్లో టీడీపీ కాగడాల ప్రదర్శన.

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను అందరూ ఖండించాలి.

5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.

మధురవాడ:వి న్యూస్ : సెప్టెంబర్ 17:

మధురవాడ : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆక్రమ అరెస్టు,రిమాండ్ ను ఖండిస్తూ జీవీఎంసీ 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ ఏ సాక్ష్యం లేకపోయినా కేవలం కక్షపూరితంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం చాలా దుర్మార్గమని, అందువలన ప్రక్క రాష్ట్రాల్లో,విదేశాల్లో ఉన్న వారు సైతం ఈ దుర్మార్గపు చర్యని ఖండిస్తున్నారని తెలిపారు. నిజంగా ఈ సైకో జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయదలచినట్లయితే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కంటే మెరుగ్గా చేసి ప్రజల అభిమానం పొందాలే కానీ అది చేతకాక అలా చేయలేక అక్రమ కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేయడం సరికాదని తెలిపారు.
ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,5వ వార్డ్ అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ(జపాన్), టిడిపి నియోజక వర్గం మహిళా అద్యక్షరాలు బోయి రమాదేవి,నియోజక వర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను,వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్ లు మరియు పెద్ద ఎత్తున నేతలు పాల్గొని క్యాండిల్స్,కాగడాలతో నిరసన తెలిపారు.మధురవాడ 5వ వార్డ్ బోట్టవానిపాలెం టిడిపి పార్టీ కార్యాలయం నుంచి శివశక్తినగర్ రోడ్డు మీదుగా కొమ్మాది జంక్షన్ వరకు సాగిన ఈకార్యక్రమంలో వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.బాబుకు తోడుగా ఉంటామంటూ నినదించారు. అన్యాయంగా తీసుకున్నటువంటి చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని ఇకనైనా వైసిపి ప్రభుత్వం కక్షపూరిత చర్యలు మానుకోవాలని, నియంతపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.ఈ కార్యక్రమంలో.... ఇయ్యపు నాయుడు,సీనియర్ నాయకులు సి.హెచ్.శ్రీనివాస్ (గడ్డి శ్రీను),బొడ్డేపల్లి రంగ,లంకా రాజేంద్ర ప్రసాద్, ఎస్టీ సెల్ నాయకులు దాలిం దోర,వంటాకుల శ్రీను,కంబపు కామరాజు,యువత అధ్యక్షులు కొండపు రాజు, సీనియర్ నాయకులు ఈగల అప్పలనాయుడు,కర్మోజు గోవిందరావు,జోగేశ్వరపాత్రో దుర్గారావు,కొత్తల శ్రీను, కొర్రాయి మంగరాజు,నమ్మి వాసు,ఈగల కిరణ్, బొట్ట కనకరాజు,ఈమంది అప్పలరాజు,డాక్టర్ కిరణ్ ,మహిళ నాయకురాలు సరస్వతి, వియ్యపు సునీత,వనిత,బుంగ కనక, నాగోతి అనిత,టెక్కలి అరుణమ్మ,నాగోతి అప్పలరాజు,ఇల్లిపిల్లి వెంగళరావు,కృష్ణవేణి,ఓలేటి శ్రావణ ,ఐటీడీపీ మొకర రవి కుమార్, ఐటీడీపీ మాదాల విజయ్,నూకరాజు,మదీనా, ఇమంది రాజు,విష్ణు,మాధవ, జ్ఞానేష్,శేఖర్, నాగేశ్వరరావు, చక్రి, అప్పారావు,అవ్వ కృష్ణ,కర్రీ సన్యాసి రావు, బర్లంగి నారాయణరావు,జీవన్,సతీష్, సూర్య,జిరి గురయ్యా, లక్ష్మణరావు,ఆనంద రావ్, కనకరాజు,ఏర్రంనాయుడు, అప్పలరాజు,ఇంజరపు రాము, బెండి శ్రీనివాసరావు,తాండ్ర సన్యాసిరావు,పొట్టి నారాయణరావు, రంది నాయుడు, పిల్ల వెంకట్రావు, జయ రెడ్డి,టెక్కలి మోహన్, పితానివాసు,టెక్కలి శ్రీనివాసరావు, బొట్ట అప్పలరాజు,బొట్ట సురేష్, మేడబోయిన కళ్యాణ్, వియ్యపు రమణ,సువ్వరి ముకుందరవు, తదితరులు పాల్గొన్నారు.