నమో వికాస్ ఉత్సవ్ లో సేవా పఖ్వారా (పక్షోత్సవాలు)

నమో వికాస్ ఉత్సవ్ లో సేవా పఖ్వారా (పక్షోత్సవాలు)..

రక్తదానంతో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు.. 

విశాఖపట్నం: వి న్యూస్ : సెప్టెంబర్ 17:

రామనగర్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం రక్త నిధి కేంద్రంలో సెప్టెంబర్ 17 గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి 73 వ జన్మదినం పురష్కరించుకొని నమో వికాస్ ఉత్సవ్ సందర్భంగా ,

 'సేవా పఖ్వారా' 

(పక్షం రోజుల సేవ) కార్యక్రమాల్లో భాగంగా గౌరవ రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరశింహ రావు గారి పిలుపు మేరకు

*పీ.ఎమ్.పి.హెల్ప్ ఆల్ అసోసియేషన్*  

పోతిన మల్లయ్య పాలెం అధ్యక్షులు లయన్ 

డొంకాడ అనీల్ కుమార్ ఆద్వర్యంలో , మండవకురిటి లక్ష్మీ ఏలూరి సంతోష్ కుమార్ ల , సహకారంతో , 

రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో 22 మంది 

యువతీ యువకులు రక్తదానానికి తరలిరాగా అందరూ రక్తదానానికి అర్హులై 22 యూనిట్లను రక్తదానం చేశారు.ఈ సందర్భంగా పి.ఎమ్.పి 

హెల్ప్ ఆల్ అసోసియేషన్ అధ్యక్షుడు లయన్ డొంకాడ అనీల్ కుమార్ మాట్లాడుతూ భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి రక్తదాన కార్యక్రమాలు

ప్రతి నెలా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమానికి బోర్డు మెంబర్ లయన్ బగ్గాం శ్రీనివాస రావు సమన్వయకర్తగా వ్యవహరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ లయన్. ఎన్.వి.ఎన్ దుర్గాప్రసాద్ ,ట్రస్టీలు లయన్ పి.చంద్రశేఖర్ , మురహరిరావు సురేష్ కంచరపాలెం మరియు రక్తదాతలందరికీ అభినందనలు తెలియజేశారు.