గిరిజన మంత్రి పై అసత్య ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు

గిరిజన మంత్రి పై అసత్య ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు...ఎంపీపీ బి. ప్రమీల

పాచిపెంట: వి న్యూస్ :సెప్టెంబర్ 05:

ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు పీడిక రాజన్నదొర పై అసత్య ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని ఎంపీపీ బి.ప్రమీల అన్నారు. మండల కేంద్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గిరిజన ఎంపీటీసీలు సర్పంచ్ లతో కలిసి ఆమె మంగళవారం పత్రిక సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి ఎస్ టి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారునాయక్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొరపై చేసిన ఆరోపణపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మతి భ్రమించి ప్రజాక్షేత్రంలో ఎలాగో గెలవలేము అని ఏం చేయాలో అర్థం కాకపోవడం తో ఎవరైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు ఉంటారో ఆ నాయకులపై ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు. సాలూరు నియోజకవర్గంలో గిరిజన ప్రజలు రాజన్న దొరను ఆరాధ్య దైవంగా కొలుస్తారని, బహుశా ఈ విమర్శలు చేసిన వ్యక్తికి తెలియదేమో అన్నారు.గిరిజనులకు అన్యాయం జరిగితే అధికార పార్టీలో ఉన్న, ప్రతిపక్ష పార్టీలో ఉన్న గిరిజనుల తరఫున నిస్వార్ధంగా పోరాటం చేసే వ్యక్తి పీడిక రాజన్న దొర ఒక్కడే అని 

 అలాంటి వ్యక్తిపై దిక్కు దివానం లేనటువంటి ఒక ఫోర్ ట్వంటీ వెధవలు ఇలా మాట్లాడటం చాలా బాధాకరం అన్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే రాజన్న దొర అవినీతి చేసినట్లు మీరు నిరూపిస్తే, రాజన్న దొర గారితో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులు అందరము కూడా రాజీనామా చేస్తామన్నారు. నిరూపించే దమ్ము ధైర్యం మీకు ఉందా అని సవాల్ విసిరారు. ఎక్కడో ఉండి ఏదో మాట్లాడటం కాదని, సాలూరు నియోజకవర్గానికి వచ్చి, చిన్నపిల్లడి నుంచి, పండు ముసలి వరకు ఎవరిని అడిగినా రాజన్న దొర అంటే ఏమిటో... ఆయన వ్యక్తిత్వం ఏమిటో చెబుతారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గు వదిలి ఇలాంటి చౌకబారి విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి అర్థం లేని చౌకబారి విమర్శలు ఎన్ని చేసినా సాలూరు నియోజకవర్గంలో రాజన్న దొర గెలుపుని ఎవరు అడ్డుకోలేరన్నారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో.... అవినీతి మచ్చలేని నాయకుడు రాజన్న దొర అని చెప్పడం కూడా అంతే నిజమన్నారు. ధారునాయక్ తో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇలాంటి సన్నాసుల ఎక్కడో తేర చాటు మాట్లాడడం కాదని దమ్ము ధైర్యం ఉంటే( పబ్లిక్) ప్రజల సమక్షంలో గాని పత్రిక విలేకరుల సమక్షంలో కానీ, ఫేస్ టు ఫేస్ మాట్లాడలని, అలా మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. మూడు రోజులు ధారునాయక్ కి టైం ఇస్తున్నాం అని ఈ మూడు రోజుల్లో ఏ ఆరోపణలు అయితే మంత్రిగారి పైన చేశాఓ ఆ ఆరోపణలు నిరూపించాలని లేకుంటే పత్రిక ముఖంగా క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ సమావేశం లో సర్పంచ్ లు చెల్లూరి సీతారాం, కొర్ర బుచ్చిబాబు, చోడిపల్లి సుందర్ రావు ఎంపీటీసీ లు కాదల అన్నపూర్ణ, మదల సత్యవతి, తోకల లక్ష్మి, తడంగి సింహాచలం తదితరులు వున్నారు.