భీమిలి మండలం జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో రూరల్ కార్యాలయం వద్ద సమావేశం.
భీమిలి: వి న్యూస్ : సెప్టెంబర్ 10:
భీమిలి మండలం జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో రూరల్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సందీప్ మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగిందనీ త్వరలో భీమిలి మండలంలో ప్రారంభం కానున్న జనంతో జనసేన కార్యక్రమం కు జనసేన నాయకులు మీ మీ పంచాయితీలో సన్నద్ధం కావాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కమిటీ నాయకులు చంద్రరావు మాట్లాడుతూ త్వరలోనే భీమిలి మండలంలోని ప్రతీ పంచాయితీలో బూత్ కమిటీ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రచార కమిటీ నాయకులు కృష్ణయ్య , భీమిలి మండల నాయకులు జి.కిరణ్ , కె.శ్రీను , వెంకటేష్ , సూరి రెడ్డి , యమ్.శ్రీను, గురునాయుడు, పాపారావు,సురేష్ , నానాజీ,రాజు,శివప్రసాద్,కొండబాబు,చందు , హేమంత్ లు పాల్గొనడం జరిగింది.
