దేశానికి కీర్తి,ప్రతిష్టలు తెచ్చిన క్రికెటర్ *రవణి* కు అపూర్వ స్వాగతం పలికిన ప్రజానీకం

దేశానికి కీర్తి,ప్రతిష్టలు తెచ్చిన క్రికెటర్ *రవణి* కు అపూర్వ స్వాగతం పలికిన ప్రజానీకం

భారీ బైక్-కార్ ర్యాలీ

స్వచ్చందంగా తరలివచ్చిన క్రికెట్,అభిమానులు-గిరిజనులు-ఉద్యోగులు

అల్లూరి జిల్లా: వి న్యూస్ :సెప్టెంబర్ 11:

ఇంగ్లాండులో జరిగిన ప్రపంచ అంధుల క్రికెట్ లో ఆస్ట్రేలియా పై భారత దేశం మహిళ క్రికెట్ జట్టు  విజయంలో కీలక పాత్ర పోషించి,మొదటి సారిగా అల్లూరి జిల్లా కు విచ్చేసిన క్రికెటర్ వలసనైని రవణి కుప్రజలు,మహిళలు,యువత,రాజకీయ పార్టీల నాయకుల నుండి అపూర్వ స్వాగతం లభించింది.

                      దారిపొడవునా  స్వాగతం లభించింది,హుకుంపేట మండల కేంద్రం సంత లో ప్రజలు,అభిమానులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి,ఆద్యంతం,ఆశ్చర్యం గా చూస్తూ..నిలబడి తమ సెల్ పోన్ లలో వీడియో లను చిత్రీకరిస్తు,సెల్ఫీలు తీసుకున్నారు, పూలు జల్లుతూ,పూల వర్షం కురిపించారు.

     పాడేరు వంతాడ పల్లి చెక్ గేట్ నుండి వందలాది బైక్,కార్లు తో  యువకులు, గిరిజనులు, క్రికెట్ అభిమానులు..జయహో...భారత్...... జైజై వలసనైని రవణి

. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ,జోరుగా,హుషారుగా,ఆద్యంతం ఆహ్లాదకరంగా వేలాదిగా ర్యాలీలో పాల్గొన్నారు. ఎవరు ఊహించని విధంగా మహిళలు క్రికెటర్ రవణి కు హుకుంపేట, చిట్టంపాడు,బాకూరు మహిళలు తిలకం దిద్ది హారతి పట్టారు. ప్రజలు, యువత, ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ వాహనం పై నిల్చోన్న క్రికెటర్ రవణి జాతీయ జెండా చేబూని,చిరునవ్వు తో,చేయి  ఊపుతూ..అందరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, బాకూరు ఎంపీటీసీ నైని రజని, సూపర్ ఎంపీటీసీ సత్తిబాబు, మెరచింత సర్పంచ్ దూసూరు పద్మకుమారి,సూపర్ సర్పంచ్ ,వెంకట రావులు పైలెట్ వాహనం లో ఉంటూ ర్యాలీని పర్యవేక్షించారు.

ఏ ఆటంకం లేకుండా పోలీసులు,  పగఢ్భంది ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.

పాడేరు నడి బొడ్డున ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కు,హుకుంపేట లో ఉన్న ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు మన్యం విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, మర్రి కామయ్యా ల కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

       అనంత గిరి జడ్పీటీసీ దీసారి గంగరాజు,ట్రైకార్ చైర్మన్ శతక బుల్లి బాబు,

అరకు పెద లబడు పంచాయితీ సర్పంచ్ పాంగి చిన్నారావు,అరకు ఎం ఈఓ త్రినాధ్,హుకుంపేట మాజీ జడ్పీటీసీ కొర్ర కాసులమ్మలు నగదు సహాయం చేశారు. వీరితో పాటు అనేకమంది గిరిజన పెద్దలు,రాజకీయ నాయకులు, గిరిజన ఉద్యోగులు ర్యాలీ,సన్మాన కార్యక్రమానికి  నగదు సమకూర్చారు.

                అల్లూరి జిల్లా  కేంద్రం పాడేరు నుండి హుకుంపేట మీదుగా రంగసింగ పాడు వరకు సాగింది.రంగసింగ పాడు లో దుస్సాలు వల తో అంగరంగ వైభవంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ప్రభుత్వం రవణి కు 25 లక్షల నగదు,పాడేరులో ఇంటి స్థలం ,ఉద్యోగ ప్రోత్సాహకాలు అందించాలని ప్రజలు కోరారు.

              ఈ కార్యక్రమంలో

హుకుంపేట ఎంపీపీ కూడ రాజుబాబు, మాజీ సర్పంచ్ వంతాల రామన్న,జీసీసీ డీఎం సీదరి రామ్మూర్తి,గిరిజన ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బోయ పల్లి సింహచలం,నాయకులు,వలస నైని కొండలరావు ,మజ్జి మన్మథ రావు, దీసారి బుచ్చెశ్వర్ రావు,మాసాడా శోభన్ బాబు,పల్లిబొయిని సింహాద్రి,తమ్మన్న మాష్టర్,అప్పన్న మాష్టర్,పీడి సింహచలం మాష్టర్, పారెస్టు అధికారి ఎన్ అప్పన్న,

భీమవరం సర్పంచ్ నైని సన్నీ బాబు,మఠం సర్పంచ్ మఠం శాంత కుమారి,కొట్నపల్లి ఎంపీటీసీ సాంబే బాలకృష్ణ,

బొడ్డ పుట్టు మాజీ ఎంపీటీసీ పాడి బాలన్న,సర్పంచ్ పాడి అచ్చులమ్మ,మత్స్య పురం సూపర్ సర్పంచ్ పూజారి సుబ్బారావు,దుర్గం సూపర్ ఎంపీటీసీ కిల్లో సాంబ,సూపర్ సర్పంచ్ పాతుని చందన పాత్రుడు,పాతకోట సూపర్ ఎంపీటీసీ సంబాయి కామారాజు,కాంగ్రెస్ పార్టీ అరుకు నియోజకవర్గ నాయకులు నోగెలి చంద్రకళ,

బాకూరు ఎంపీటీసీ సదాశివ రాజు,ఏపీ టీ ఎఫ్ నాయకులు బట్టి చిన్నారావు,గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపుల కృష్ణా రావు,మెరకచింత మాజీ సర్పంచ్ వలసనైని లక్ష్మణ్ రావు, క్రికెట్ క్రీడాకారులు, అభిమానులు,యువకులు,మహిళలు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.