*నకిలీ సర్టిఫికెట్ పొందిన గిరిజనేతరుడి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
అల్లూరి జిల్లా,అరకువ్యాలీ వి న్యూస్ సెప్టెంబర్ 5 :-
కుల ధ్రువీకరణ పత్రము జారీ చేసిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలి - ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్*అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం పెద్దలబుడు గ్రామపంచాయతీ సచివాలయం-1 పరిధిలో అరకు వేలి టౌన్ షిప్ కొండవీది నివాసముంటున్న పిట్టల రాంబాబు S/o ఆదినారాయణ కాపు బీసీ (డీ) ఇటీవల తేదీ.29-05-2023 న అరకు వేలి తాసిల్దార్ కార్యాలయం నుండి ఎస్టీ భగత కుల ధ్రువీకరణ పత్రం పొంది ఉన్నారని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్ మండల నాయకులు టి హరీ కే జగన్నాథం కె సహదేవ్ లతో కలిసి మీడియా సమావేశంలో నకిల ఎస్టీ భగత కులధృహపత్రం బహిర్గతం చేశారు.
ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసి షెడ్యూల్ ప్రాంతంలో వ్యాపారం నిమిత్తం నివాసం ఏర్పాటు చేసుకున్న గిరిజనేతరులు ఆదివాసి హక్కులను చట్టాలను ధిక్కరించి లాడ్జిలు పెద్ద భవనాలు వ్యాపార సముదాయాలు నిర్మాణం చేపట్టడమే కాకుండా నేరుగా నకిలీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందడం అత్యంత దుర్మార్గమని అరకు వేలి మండలం పెదలబుడు పంచాయితీలో అరకువేలి టౌన్షిప్ లో గిరిజనేతరులు రెవిన్యూ అధికారులకు ముడుపులు చెల్లించి నకిలీ కుల ధ్రువకురణ పత్రాలు పొందుతున్నారని పిట్టల రాంబాబు అనే వ్యక్తి కాపు కులానికి చెందిన గిరిజనేతరుడని పిట్టల ఇంటి పేరుతో ఆదివాసి భగత తెగలో అరకు వేలి మండలంలో 14 పంచాయితీల పరిధిలో ఎవరు లేరని నకిలీ ఎస్టి ధ్రువీకరణ పత్రం పొందిన పిట్టల రాంబాబు s/o ఆదినారాయణ కాపు బీసీ (డీ) పై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని నకిలీకుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన అరకు వేలి రెవెన్యూ కార్యాలయం సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నది.
ఇటీవికాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో కుల ధ్రువీకరణ పత్రాలు ఇంటింటికి అందిస్తున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్న ఆదివాసి ప్రాంతంలో నఖీలి ఆదివాసి కులాద్రివీకరణ పత్రాలు జారి అయ్యే ప్రమాదం ఉందని వీటి పై అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలని ఆదివాసి ప్రాంత మండల కేంద్రాలు ఆనుకుని ఉన్న సచివాలయాల పరిధిలో సమగ్ర విచారణ జరిపితే అనేక నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లు బయటకు వస్తాయని తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం.

