విశాఖ ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిమ్మకాయల భాస్కర్

విశాఖ ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిమ్మకాయల భాస్కర్ 

పీఎం పాలెం:వి న్యూస్:సెప్టెంబర్ 04:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ఉపాధ్యాయ దినోత్సవంగా పిఠాపురం వేదికగా ఆంధ్రప్రదేశ్లోని 79 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయడం జరిగింది దానిలో భీమిలి కి చెందిన  నిమ్మకాయల భాస్కర్ బేతని స్కూల్ పీఎం పాలెం నందు వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎన్ సి సి మాస్టారు గా పనిచేస్తున్నారు   విశాఖపట్నం జిల్లా తరఫునుండి ఎంపిక చేయడం జరిగింది మూడో తారీకు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు       ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర నాయకులు రాష్ట్ర పి టి ఎల్ యు  అధ్యక్షులు  అంబేడ్కర్ సారధ్యంలో ఉపాధ్యక్షులు శ్యాంప్రసాద్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథం కోఆర్డినేటర్ కిరణ్ ఆధ్వర్యంలో సాలువ తో సన్మానించే జ్ఞాపిక బహుకరించడం  జరిగింది. 

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నిమ్మకాయల భాస్కర్ మాట్లాడుతూ గవర్నమెంట్ టీచర్లకు ఎప్పుడు ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది కాని ప్రైవేట్ సంస్థల పనిచేస్తున్న వారికి ప్రభుత్వం కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పి టి ఎల్ యు ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులను గుర్తించి ఇలా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని ఉపాధ్యాయ వృత్తిలో ఇలాంటి అవార్డుల అందుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని భావించారు  విద్యార్థులకు తరఫున శిక్షణ ఇవ్వడంలో తన వంతు కృషి చేస్తానని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అవరోధించడానికి వ్యాయామ విద్య ఎన్ సి సి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుందని సూచించారు.