ఇస్రోలో విషాదం .. కౌంట్ డౌన్ చెప్పే సైంటిస్ట్ మృతి ...చంద్రయాన్-3 ప్రయోగం సమయం మే చివరి కౌంట్ డౌన్ ||
▪️ఇస్రోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
▪️రాకెట్ ప్రయోగాల సమయంలో వినిపించే గొంతు మూగబోయింది.
▪️ఇస్రో సైంటిస్ట్ వాలార్మతి హఠాత్తుగా కన్నుమూశారు.
▪️శనివారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె గుండెపోటుతో చనిపోయారు.
▪️వాలార్మతి చివరిసారిగా జులై 14న ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం సమయంలో కౌంట్ డౌన్ చెప్పారు.
▪️ఇస్రో చేపట్టే ఎన్నో ప్రయోగాల సమయంలో లైవ్ స్ట్రీమింగ్కు ఆమె వాయిస్ ఇచ్చేవారు.
▪️ఇస్రో ప్రయోగాల సమయంలో వినిపించే వాలార్మతి గొంతు దేశ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయింది.
▪️ఆమె మృతికి ఇస్రో సైంటిస్టులు సంతాపం తెలిపారు.
▪️1959లో తమిళనాడులోని అరియలూర్‌లో జన్మించిన వలార్మతి 1984లో ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరారు.
▪️మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని మొదటిసారిగా 2015లో వాలార్మతి అందుకున్నారు.
▪️చివరిసారిగా చంద్రయాన్-3 మిషన్ రాకెట్‌కు వలార్మతినే కౌంట్‌డౌన్ చెప్పడం విశేషం.
▪️ మీకు మరణం లేదు తల్లీ ... రాకెట్ కౌంట్‌డౌన్ సమయంలో వినిపించే వాలార్మతి గొంతు దేశ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

