దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధOతి సందర్భంగా చంద్రంపాలెం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ ఘనంగా నిర్వహించారు,
మధురవాడ: వి న్యూస్:సెప్టెంబర్ 02:
మధురవాడ చంద్రంపాలెం బాపూజీ కళా మందిరం వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, ఆయన ప్రవేశపెట్టిన చేసిన రైతులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, మొదలగు పధకాలను ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు, అలాగే వైయస్సార్ తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి బాటలో నడుస్తూ వైయస్సార్ ప్రవేశ పెట్టిన పధకాలు అన్ని కొనసాగిస్తూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి లో మొదటి స్థానంలో నిలుపుకున్నారు అదేవిధంగా భీమిలి నియోజకవర్గంలో మాజీ మంత్రి వర్యులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారనీ కొనియాడారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిళ్లా లక్ష్మణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పిళ్లా సూరిబాబు, పోతిన పైడిరాజు, పిళ్లా చంద్రశేఖర్, పీస రామారావు, పిళ్లా అప్పన్న, జగుపిల్లి నరేష్, నాగోతి తాతారావు, జగుపిల్లి అప్పారావు, పిళ్లా వెంకటరమణ, పిళ్లా రాము, పిళ్లా పోతురాజు, దుక్క వరం, పిళ్లా రాము పాత్రుడు, పిళ్లా లక్ష్మణ పాత్రుడు, పిళ్లా సన్యాసిరావు, గరె నాగేశ్వరరావు, పిళ్లా సురేష్ , పొట్నూరి వాసు తదితరులు పాల్గొన్నారు.

