శ్రీ భూనీల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జనసేన అధ్యక్షులు కోనేదల పవన్కళ్యాణ్ జన్మదిన వేడుకలు.
మధురవాడ:వి న్యూస్:సెప్టెంబర్ 02:
మధురవాడ మిదిలాపురి ఉడాకాలనీ కొండపై వెంచేసిఉన్న శ్రీ భూనీల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జనసేన అధ్యక్షులు కోనేదల పవన్కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్బంగా భీమిలి నియోజకవర్గం మీడియా కన్వీనర్ నాగోతి నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, పవన్కళ్యాణ్ నామ నక్షత్రం తో అభిషేకాలు చాలా ఘనంగా నిర్వహించారు.
అనంతరం పర్యావరణం పరిరక్షణలో భాగంగా పవన్కళ్యాణ్ పేరుతో దేవాలయం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి భీమిలి నియోజకవర్గం ప్రచార కమిటీ సభ్యులు బీవీ కృష్ణయ్య మాట్లాడుతూ రాబోయే ఎన్నికల లో జనసేన భారీ మెజారిటీ తో గెలుపొంది పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి గా ఎన్నిక కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించమని తెలిపారు.మీడియా కన్వినర్ నాగోతి నాయుడు మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్కళ్యాణ్ మంచి ఆశయంతో రాజకీయల లోకి వచ్చి గత ఎన్నికలలో ఓడిపోయిన అలుపెరగని నాయకుడిగా అధికారం లేకపోయినా తను కష్టపడుతూ సంపాదించిన డబ్బులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సహాయం చేస్తున్నారని అలాగే ఆయురారోగ్యాలతో ఉంటూ రాబోతున్న ఎన్నికలలో జనసేన నాయకులు అత్యధిక మెజారిటీ తో గెలుపొంది రాష్ట్రలో ప్రభుత్వo ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రజలను రాక్షస ప్రభుత్వం నుంచి విముక్తులను చేసి ప్రజలకు మంచి చేకూరె విధంగా జనసేన పాలన సాగాలని కోరుతూ శ్రీ భూనీల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవన్కళ్యాణ్ నామ నక్షత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు పవన్కళ్యాణ్ జన్మదినo గుర్తుగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం భూత్ కమిటీ సభ్యులు ఈ ఎన్ ఎస్ చందర్ రావు, భీమిలి 7వ వార్డ్ నాయకులు పోతిన తిరుమల రావు, నాయుడు, నాని, చిన్న, త్రినాధ్ తదితర నాయకులు పాల్గొన్నారు.


