మహిళా బిల్లు ఆమోదం సందర్భంగా ప్రధాని మోడీకి పాలాభిషేకం.

మహిళా బిల్లు ఆమోదం సందర్భంగా ప్రధాని  మోడీకి పాలాభిషేకం

ఆనందపురం: వి న్యూస్ : సెప్టెంబర్ 19:

పార్లమెంట్ లో మహిళా బిల్లు ఆమోదం సందర్భంగా జన జాగరణ సమితి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రధాని మోడీకి విద్యార్థినులచేత పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గ్రిద్దలూరు విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం యావత్ భారతీయ మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సందర్భంలో ప్రధాని మోడీ నాయకత్వంలో బిల్లు ఆమోదింప చేస్తున్నందుకు వారికి  మహిళలందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో అనేకమార్లు మహిళా బిల్లును ప్రవేశపెట్టిన రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల బిల్లు ఆమోదింపబడలేదు అని అన్నారు. మహిళా బిల్లు ఆమోదంతో భారత్ మాతాకీ జై అనే నినాదం సాకారం అవుతుందన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా నిస్వార్ధంగా ప్రజాసేవ చేయడానికి ప్రధాని మోడీ చక్కని అవకాశం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు, సామాజిక కార్యకర్త బొమ్మ శ్రీహరికృష్ణ మరియు ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ విద్యార్థినులు పాల్గొన్నారు.