ఆనందపురంలో బాబు తో నేను అనే కరపత్రాలను పంపిణీ చేసిన భీమిలి టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు

ఆనందపురంలో బాబు తో నేను అనే కరపత్రాలను పంపిణీ చేసిన భీమిలి టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు 

ఆనందపురం: వి న్యూస్ : సెప్టెంబర్ 19:

భీమిలి నియోజకవర్గం వాణిజ్య విభాగ కమిటీ ఆధ్వర్యంలో ఆనందపురం మండలంలో "బాబుతో నేను" అని ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టిన.. భీమిలి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ కోరాడ రాజబాబు  మంగళవారం భీమి నియోజకవర్గ పరిధి ఆనందపురం మండలంలో భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసు బనాయించి రిమాండ్ కి పంపించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకి సంఘీభావం తెలుపుతూ బాబుతో నేను అనే కరపత్రాలను ప్రజలకు పంచుతూ వాణిజ్య సముదాయాల వారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల సత్యనారాయణ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు తాట్రాజ్ అప్పారావు ప్రధాన కార్యదర్శి గుండు గోవిందరావు (చిన్న బాబు) ఉపాధ్యక్షులు కొట్టియాడ రెడ్డి బాబు వి ఆర్ కె రాజు లక్ష్మణరావు  ఆనందపురం ఎంపీటీసీ బంటుపిల్లి అప్పలస్వామి  గొట్టిపల్లి ఎంపిటిసి దొంతల కనకరాజు తదితర అనంతపురం మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.