చేపల ఉప్పాడ లో ఆకట్టుకుంటున్న సినిమా హాల్ మండపం

చేపల ఉప్పాడ లో ఆకట్టుకుంటున్న  సినిమా హాల్ మండపం

భీమిలి: వి న్యూస్ : సెప్టెంబర్ 19:

భీమునిపట్నం: బీచ్ రోడ్ లోని చేపల ఉప్పాడ యూత్ బాయ్స్ ఆధ్వర్యంలో తగరపువలస రాములమ్మ థియేటర్ మాదిరిగా వేసిన భారీ వినాయక మండపం చూపరులను అమితంగా ఆకట్టుకుంటుంది. అచ్చం నిజమైన సినిమా హాల్ లాగే లోపల తెర, సీటింగ్, ఏసీ, ఇలా అన్ని సదుపాయాలతో ఒక పక్క సినిమా వేస్తున్నారు. ఎంట్రన్స్ లో భారీ విగ్రహం పెట్టీ పూజలు చేస్తున్నారు. ప్రతి ఏడాది విభిన్న రూపాల్లో ఇక్కడ వేస్తున్న మండపం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాది ఇక్కడ  వేసిన అన్న క్యాంటీన్ సెట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. 


కాగా  ఈ విభిన్న మైన సెట్ లో సోమవారం జరిగిన వినాయక చవితి వేడుకల్లో మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ కారి అప్పారావు , మాజీ ఎంపీటీసీ సభ్యులు చీపుల శ్రీనివాసరావు , కారి రాములు , గ్రామ పెద్దలు యువకులు మహిళలు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.