బీచ్ రోడ్ లోని కాపులు దిబ్బడి పాలెంలో ధన శక్తి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం
భీమిలి: వి న్యూస్ : సెప్టెంబర్ 19:
భీమిలి: బీచ్ రోడ్ లోని కాపులు దిబ్బడి పాలెం గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ ధనశక్తి ( దానా శక్తి). అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు వాసుపల్లి రాంబాబు, వాసుపల్లి అజయ్ ఎల్లాజీ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమం, తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు వెయ్యి మంది భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసి తీర్థ ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో గ్రామ కుల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

