విశాఖ జిల్లా మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు యోలూరు ధర్మవతి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం

విశాఖ జిల్లా మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు యోలూరు ధర్మవతి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం.

ఆనందపురం :వి న్యూస్ :సెప్టెంబర్ 20:

బుధవారం ఉదయం నారి శక్తి వందన్ చట్టం పార్లమెంటు మరియు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టినందుకు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం లో ఆనందపురం మండలంలో గంభీరం గ్రామం లో మండల మహిళా మోర్చ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు యోలూరు ధర్మవతి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం యావత్ భారతీయ మహిళలు అందరూ ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న సందర్భంలో ప్రధాన మోడీ నాయకత్వంలో బిల్లు ఆమోదం చేస్తున్నందుకు వారికి మహిళలు అందరు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమం ఉద్దేశించి,బిజేపి విశాఖ జిల్లా కిసాన్ కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్ బిజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు బిజేపి మండల పార్టీ అధ్యక్షులు మీసాల రామునాయుడు మాట్లాడుతూ ఈరోజు చారిత్రాత్మకమైన రోజు.కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ సమావేశం ప్రారంభమైంది మరియు "నారీ శక్తి వందన్ చట్టం" (పార్లమెంట్ మరియు అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు) లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది. 

ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మహిళలందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:- ఆనందపురం మండల బిజేపి మహిళా మోర్చనాయకురాలుగోడి ఆదిలక్ష్మి,మామిడి లక్ష్మి,గోడి వెంకట లక్ష్మీ,మామిడి పైడమ్మ,కే. ఏర్రయమ్మ,గోడి గిరిజ పీతల పెంటమ్మ,గుసిడి పార్వతి,మామిడి శాంతమ్మ,లింగాల వరలక్ష్మి, కుమారి అపర్ణ మహిళలందరు పాల్గొన్నారు.